12వ అంతస్తు నుంచి కిందపడ్డ చిన్నారిని ఎలా క్యాచ్ పట్టాడో చూడండి

దిశ,వెబ్‌డెస్క్: 12వ అంతస్తు నుంచి పడిపోయిన చిన్నారిని కాపాడి సోషల్ మీడియాలో హీరో అయ్యాడు. వియాత్నంలోని హనోయి చెందిన 16 అంతస్తుల భవనం 12వ ఫ్లోర్ నుంచి 2 ఏళ్ల చిన్నారి బాల్కనీ నుండి జారి పడింది. పడే సమయంలో చిన్నారి బాల్కనీ రైలింగ్ ను  పట్టుకోవడంతో.., ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ వాసులు చిన్నారిని కాపాడాలంటూ కేకలు వేశారు. ఫలితం లేకపోయింది. పట్టుకోల్పోవడంతో చిన్నారి కిందపడిపోయింది. వీడియో తీస్తున్నవాళ్లు సైతం చిన్నారికి ఏదో అపాయం జరిగిందని […]

Update: 2021-03-03 06:34 GMT

దిశ,వెబ్‌డెస్క్: 12వ అంతస్తు నుంచి పడిపోయిన చిన్నారిని కాపాడి సోషల్ మీడియాలో హీరో అయ్యాడు. వియాత్నంలోని హనోయి చెందిన 16 అంతస్తుల భవనం 12వ ఫ్లోర్ నుంచి 2 ఏళ్ల చిన్నారి బాల్కనీ నుండి జారి పడింది. పడే సమయంలో చిన్నారి బాల్కనీ రైలింగ్ ను పట్టుకోవడంతో.., ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ వాసులు చిన్నారిని కాపాడాలంటూ కేకలు వేశారు. ఫలితం లేకపోయింది. పట్టుకోల్పోవడంతో చిన్నారి కిందపడిపోయింది. వీడియో తీస్తున్నవాళ్లు సైతం చిన్నారికి ఏదో అపాయం జరిగిందని అనుకున్నారు. కానీ కింద ఓ హీరో ఉన్నాడని, ఆ హీరోనే శక్తిమాన్ లా చిన్నారి ప్రాణాలు కాపాడుతాడని ఊహించలేకపోయారు.

ఆదివారం సాయంత్రం 5గంటల సమయంలో డెలివరీ బాయ్ ‘మన్హ్’ తన వాహనంతో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాడు. రోడ్డు పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పార్శిల్ ఇవ్వాల్సి ఉంది. ఆ పార్శిల్ ఇచ్చేసి, వాహనంతో మరో ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో ఓ వైపు పాప ఏడుపులు, మరో వైపు స్థానికులు కేకలు. దీంతో మన్హ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వెహికల్ నుంచి పైకి చూశాడు. అంతే గాలిలో కిందనుంచి 50 అడుగుల ఎత్తులో ఉన్న పాప కిందపడడం గమనించాడు. మెరుపు వేగంతో వాహనం దిగి రెండడుగుల ఎత్తులో ఉన్న టైల్ పైకప్పుపైకి దూకి పాప కిందపడిపోకుండా క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో మన్హ్ సాహసంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా డెలివరీ బాయ్ మన్హ్ మాట్లాడుతూ ” స్థానికులు కేకలు వేయడంతో పైకి చూశాను. పాప కిందపడడాన్ని గమనించా. పాపను రక్షించేందుకు దూకి చేతుల్లోకి తీసుకున్నాను. అనంతరం ఏడుస్తున్న చిన్నారిని ఓదార్చేందుకు ఆలింగనం చేసుకున్నాను. అప్పుడే చిన్నారి నోటి నుంచి రక్తం కారుతుంది. ఏం జరిగిందోనని చాలా బయపడ్డానని మన్హ్ గుర్తు చేస్తున్నాడు. చాలా మంది నేను చేసిన ఈ పనికి నన్ను హీరో చేస్తున్నారు. నేను అలా హీరోగా భావించడం లేదు. ఎందుకంటే నా ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే అలాగే చేస్తారు. నన్నునేను హీరోగా చూసుకోవడం లేదు. మంచి చేయాలని మాత్రమే అనుకుంటున్నాని” వ్యాఖ్యానించాడు.

వీడియో వైరల్ కావడంతో ఎక్కడెక్కడి నుంచో నాకు బహుమతులు, డబ్బులు పంపిస్తున్నారు. వాటన్నింటిని నేను సున్నితంగా తిరస్కరించా.నేను ఫ్రీగా వచ్చే డబ్బు గురించి ఆశించను’ అని సోషల్ మీడియా హీరో మన్హ్ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.

https://twitter.com/Unicanal/status/1366438688557834240

Tags:    

Similar News