ఢిల్లీలో 32కు చేరిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో నాలుగు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయానికి ఢిల్లీ అల్లర్లలో మరణించినవారి సంఖ్య 32కు చేరింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 200కు చేరింది. ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పుర్, మౌజ్‌పుర్, కరవాల్ నగర్‌లలో బుధవారం రాత్రి మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్.. అల్లర్ల ప్రభావిత ప్రాంతాలను సందర్శించి శాంతిని నెలకొల్పుతామని ప్రకటించిన తర్వాత ఈ […]
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో నాలుగు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయానికి ఢిల్లీ అల్లర్లలో మరణించినవారి సంఖ్య 32కు చేరింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 200కు చేరింది. ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పుర్, మౌజ్‌పుర్, కరవాల్ నగర్‌లలో బుధవారం రాత్రి మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్.. అల్లర్ల ప్రభావిత ప్రాంతాలను సందర్శించి శాంతిని నెలకొల్పుతామని ప్రకటించిన తర్వాత ఈ ఘటనలు పునరావృతం కావడం గమనార్హం. ఢిల్లీ వాసులు శాంతిని పాటించాలని ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.