బస్సులో ఢిల్లీ టు లండన్ టూర్

దిశ, వెబ్ డెస్క్ : లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టపడని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ట్రావెలింగ్‌ను కూడా ఎంతోమంది ఎంజాయ్ చేస్తారు. ఈ రెండింటి కలయికగా కొత్త దేశాలను తిరిగే చాన్స్ వస్తే.. ఎవరైనా వదులుకుంటారా? నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ అఫ్టర్ అంటూ.. పెట్టెబేడా సర్దుకుని పోలోమని రెడీ అయిపోరు. అది కూడా ఒకటో రెండో దేశాలు కాదు.. ఏకంగా 18 దేశాలు, 70 రోజుల బస్సు ప్రయాణం. ఆ రైడ్ విశేషాలేంటో […]

Update: 2020-08-24 02:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టపడని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ట్రావెలింగ్‌ను కూడా ఎంతోమంది ఎంజాయ్ చేస్తారు. ఈ రెండింటి కలయికగా కొత్త దేశాలను తిరిగే చాన్స్ వస్తే.. ఎవరైనా వదులుకుంటారా? నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ అఫ్టర్ అంటూ.. పెట్టెబేడా సర్దుకుని పోలోమని రెడీ అయిపోరు. అది కూడా ఒకటో రెండో దేశాలు కాదు.. ఏకంగా 18 దేశాలు, 70 రోజుల బస్సు ప్రయాణం. ఆ రైడ్ విశేషాలేంటో తెలుసుకోండి.

ఎపిక్ రోడ్ ట్రిప్ కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఆ తీపి కబురు రానే వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారి.. సుదూర బస్సు ప్రయాణానికి అంతా సిద్ధమైంది. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి యూకే కేపిటల్ లండన్ వరకు బస్సు జర్నీ.. 2021 మే నెలలో ప్రారంభం కానుంది. సాహసయాత్రలు ఇష్టపడేవారి కోసం ‘అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్’ అనే కంపెనీ ఈ అవకాశాన్ని కల్పిస్తుండగా.. 18 దేశాల మీదుగా 70 రోజుల పాటు 20 వేల కిలోమీటర్లు ఈ ప్రయాణం ఉంటుందని స్పష్టం చేసింది.

జర్నీ..

మ‌య‌న్మార్‌, థాయ్‌లాండ్‌, లావోస్‌, చైనా, కిర్గిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, క‌జ‌కిస్తాన్‌, ర‌ష్యా, లాట్వియా, లిథువేనియా, లాట్వియా, పోలాండ్‌, చెక్ రిప‌బ్లిక్‌, జర్మ‌నీ, నెద‌ర్లాండ్స్‌‌, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మీదుగా ఈ బస్సు లండన్ చేరుకోనుంది. 20 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్స్, ఓ గైడ్, ఓ హెల్పర్ ఉంటారు.

4 మేజర్ డెస్టినేషన్స్..

లెగ్ 1 : ఇందులో ఇండియా, మయన్మార్, థాయ్‌లాండ్ కవర్ అవుతాయి.
లెగ్ 2 : చైనాలోని సియాచిన్, జిన్ జియాంగ్ ప్రావిన్సెస్ చుట్టేస్తారు. ఇందులో భాగంగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చైనా వాల్‌తో పాటు సిల్క్ రూట్, గోబీ ఎడారి తదితర చైనా ఫేమస్ ప్రాంతాలను చూపిస్తారు.
లెగ్ 3 : కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌, క‌జ‌కిస్తాన్‌, ర‌ష్యాలను చూపిస్తారు.
ఫైనల్ లెగ్ : యూరోపియన్ దేశాలు – లాట్వియా, పోలాండ్, లిథువేనియా, చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్, జర్మనీ. బెల్జియం, ఫ్రాన్స్.. చివర్లో యునైటెడ్ కింగ్‌డమ్.

డీటెయిల్స్ : ఈ అడ్వెంచర్ జర్నీకి అక్షరాల రూ. 15 లక్షలు టికెట్ రేటుగా నిర్ణయించారు. అన్ని ఏర్పాట్లను సదరు కంపెనీనే చూసుకుంటుంది. వెజిటేరియన్ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. హోటల్‌లో సెపరేట్ గదులు కాకుండా ట్విన్ షేరింగ్ ఇస్తారు. వీసాలు, స్టాండర్డ్ టూరిస్ట్ వీసా ఫీజులు, బోర్డర్ క్రాసింగ్ అసిస్టెన్స్, ఇంగ్లిష్ స్పీకింగ్ గైడ్ ఇవన్నీ కంపెనీనే చూసుకుంటుంది.

Tags:    

Similar News