భారత్‌లో చైనీయుల భారీ మోసం.. చెక్ పెట్టిన పోలీసులు

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట భారీ స్థాయిలో మోసాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా భారత ప్రజలను టార్గెట్ చేసుకున్న చైనా యాప్ నిర్వాహకులు ఇటువంటి నేరాలకు ఆయువు పోస్తున్నారు. తాజాగా ఢిల్లీలో చైనా ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నకిలీ యాప్‌ల పేరుతో ఏకంగా రూ. 150 కోట్లు మోసం చేసిన చైనా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ […]

Update: 2021-06-09 04:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట భారీ స్థాయిలో మోసాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా భారత ప్రజలను టార్గెట్ చేసుకున్న చైనా యాప్ నిర్వాహకులు ఇటువంటి నేరాలకు ఆయువు పోస్తున్నారు. తాజాగా ఢిల్లీలో చైనా ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నకిలీ యాప్‌ల పేరుతో ఏకంగా రూ. 150 కోట్లు మోసం చేసిన చైనా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ యాప్‌లతో ఏకంగా 5 లక్షల మందిని మోసం చేశారు. పవర్‌బ్యాంక్, సన్‌ఫ్యాక్టరీ, ఎజ్‌ప్లాన్ యాప్‌ల ద్వారా మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నామని సైబర్ సెల్ డీసీపీ అన్యేష్ రాయ్ తెలిపారు. దోచుకున్న నగదును భద్రపరిచిన అకౌంట్లను గుర్తించి.. ఫ్రీజ్‌ చేసే పనిలో పడ్డారు ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు.

Tags:    

Similar News