కరోనా.. మీడియాకు రూల్స్ వర్తించవా!

దిశ, వెబ్‌డెస్క్: పైన కనపడే ఫోటో సూస్తున్నరు కదా ! గిది మన మీడియా మిత్రులు చేస్తున్న పని. తెరమీద గంటలకు గంటలు ఎవ్వలు బయటకు వెళ్లొద్దు, గక్కడ గాళ్లకు కరోనా వచ్చింది, మనం గూడ ఇంట్లనే ఉందాం, బయటకు వెళ్లొద్దు. లేకుంటే బాగా ఇబ్బందులు పడుతం, పాణాలు పోతయి అనుకుంట ఓ దంచుడు దంచుకుంటనే, తీరా పెద్ద పెద్ద లీడర్లు మాట్లాడితర్కే అన్ని బేఖాతరు చేసి ఉరికి ఎదురుంగ మూతి దగ్గర మైక్‌లు పెడుతున్నరు. ఇదంత […]

Update: 2020-03-23 09:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: పైన కనపడే ఫోటో సూస్తున్నరు కదా ! గిది మన మీడియా మిత్రులు చేస్తున్న పని. తెరమీద గంటలకు గంటలు ఎవ్వలు బయటకు వెళ్లొద్దు, గక్కడ గాళ్లకు కరోనా వచ్చింది, మనం గూడ ఇంట్లనే ఉందాం, బయటకు వెళ్లొద్దు. లేకుంటే బాగా ఇబ్బందులు పడుతం, పాణాలు పోతయి అనుకుంట ఓ దంచుడు దంచుకుంటనే, తీరా పెద్ద పెద్ద లీడర్లు మాట్లాడితర్కే అన్ని బేఖాతరు చేసి ఉరికి ఎదురుంగ మూతి దగ్గర మైక్‌లు పెడుతున్నరు.

ఇదంత ఎక్కన్నో జరగలేదు. దేశానికి సంబంధించిన చట్టాలు జేసుడు, ప్రజల సమస్యలపై చర్చలు జరిపే పార్లమెంట్ ముందట్నే జరిగింది. సుప్రీంకోర్టు మాజీ సీజేఐ రంజన్ గొగొయ్ సారు.. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం జేసినంక బయటకు వచ్చే టైంల ఒక్కసారిగా మన రిపోర్టర్లు, కెమెరామెన్లు పోయి సుట్టు గుమికూడిర్రు. దీంతో ఒక్కసారిగా అక్కడ మాట్లాడే రంజన్ గొగొయ్ సార్కు, మైక్‌లు, కెమెరాలు పట్టుకున్నొళ్లకు గాలి ఆడనంత పనిజేసి, ఒకలి గాలి ఒకలు పీల్చుకునేంత దగ్గర్కు నిలబడి బైట్ తీసుకున్నరు.

ఇప్పటికే ప్రపంచం మొత్తం మాయదారి కరోనా వైరస్‌తోని యుద్ధం జేస్కుంట, జనాలు గూమికూడొద్దు, తాకొద్దు ఓ వైపు చెప్పుతూనే ఉండగ, మన దగ్గర కూడా టీవీల్ల, పేపర్ల గవే ముచ్చట్లు వస్తున్నయి. మన ప్రధాని మోడీ సారు కూడా మీడియాలో మంచిగ సమాచారం ఇచ్చుకుంటా మీరు జాగ్రత్తగా ఉండాలి. మైకులు, కెమెరాలు దూరంగా పెట్టాలని సూచనలు గూడ జేస్తుండు. లేకుంటే కరోనా వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉందనే చెప్పుతనే ఉన్నరు. కానీ మన రిపోర్టర్లు అన్ని పక్కన పెట్టి లైవ్‌ల కనపడ్డప్పుడు ఒక రకంగా, ప్రెస్‌మీట్లప్పుడు డోంట్ కేర్ అనుకుంట ఎగబడి మైకులు పెడుతున్నరు. గీ బాధ్యత గల మీడియా ప్రతినిధులే గిట్ల జేస్తే సామాన్య ప్రజలు ఇంక ఎట్లుంరని పబ్లిక్ గుస గుస పెట్టుకుంటున్నరు.

Tags: Parliament, karona, gogoi, media, reporters, former cji

Tags:    

Similar News