లాక్‌డౌన్ మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజుల పాటు పొడగిస్తూ ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడగిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేందుకు 6 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ గత వారం నిర్ణయం తీసుకున్నాం. సోమవారం ఉదయంతో లాక్‌డౌన్ ముగియాల్సి ఉన్నది. కానీ రాష్ట్రంలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం […]
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజుల పాటు పొడగిస్తూ ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడగిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేందుకు 6 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ గత వారం నిర్ణయం తీసుకున్నాం. సోమవారం ఉదయంతో లాక్‌డౌన్ ముగియాల్సి ఉన్నది. కానీ రాష్ట్రంలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 36 నుంచి 37 శాతం పాజిటివ్ రేటు ఉంది. ఇది గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా కరోనా పరిస్థితులు అదుపులోకి రాలేదు. దీంతో లాక్ డౌన్‌ను పొడగించాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో లాక్ డౌన్ పొడగించాలని ప్రజలు కూడా అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. దీంతో లాక్ డౌన్‌ను మే3 వరకు పొడగిస్తు నిర్ణయం తీసుకుంటున్నాం’ అని అన్నారు.