‘ఆక్సిజన్ లేదు.. హాస్పిటల్‌కు రాకండి’
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆక్సిజన్ కొరత ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో నో అడ్మిషన్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు చనిపోతున్న ఘటనల గురించి రెండు, మూడు రోజులుగా వింటున్నాం. కాగా తాజాగా ఆక్సిజన్ కొరత నేపథ్యంలో రోగులను అడ్మిట్ చేసుకోబోమని ఆస్పత్రుల ముందు బోర్డులు కనిపిస్తుండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఆక్సిజన్ కొరత దృష్ట్యా పేషెంట్లను అడ్మిట్ చేసుకోబోమని శనివారం ఢిల్లీలోని సరోజ ఆస్పత్రి ముందు బోర్డులు […]
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆక్సిజన్ కొరత ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో నో అడ్మిషన్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు చనిపోతున్న ఘటనల గురించి రెండు, మూడు రోజులుగా వింటున్నాం. కాగా తాజాగా ఆక్సిజన్ కొరత నేపథ్యంలో రోగులను అడ్మిట్ చేసుకోబోమని ఆస్పత్రుల ముందు బోర్డులు కనిపిస్తుండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఆక్సిజన్ కొరత దృష్ట్యా పేషెంట్లను అడ్మిట్ చేసుకోబోమని శనివారం ఢిల్లీలోని సరోజ ఆస్పత్రి ముందు బోర్డులు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఫోర్టీస్ ఎస్కార్ట్ హార్ట్ ఇనిస్టిట్యూట్ ముందే కూడా నో అడ్మిషన్ బోర్డు కనిపించింది. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో నిన్నటి దాకా ఆక్సిజన్ దొరక్క బాధపడిన రోగులు..తాజాగా ఆస్పత్రులు దొరక్క బాధపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది.