రోజుకు లక్ష మందికి టీకా: సత్యేందర్ జైన్
న్యూఢిల్లీ: కరోనా టీకా అందుబాటులోకి రాగానే ఢిల్లీ వాసులందరికీ ఉచితంగా అందిస్తామని, వ్యాక్సినేషన్ ప్రక్రియకు సర్వం సంసిద్ధంగా ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. టీకాతోపాటు కరోనా చికిత్స, మందులూ ఉచితంగా అందించడానికి ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. రోజుకు లక్ష మందికి టీకా వేయడానికి ప్లాన్ వేస్తున్నామని అన్నారు. ఇక్కడ ప్రాధాన్యతావర్గాలకు టీకా వేయడం కోసం వ్యాక్సిన్ స్వీకరణ, నిల్వ సదుపాయాలు సిద్ధం చేశామని వివరించారు. హాస్పిటల్స్, హాస్పిటల్ సంబంధిత ఫెసిలిటీలనే వ్యాక్సినేషన్ కేంద్రాలుగా […]
న్యూఢిల్లీ: కరోనా టీకా అందుబాటులోకి రాగానే ఢిల్లీ వాసులందరికీ ఉచితంగా అందిస్తామని, వ్యాక్సినేషన్ ప్రక్రియకు సర్వం సంసిద్ధంగా ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. టీకాతోపాటు కరోనా చికిత్స, మందులూ ఉచితంగా అందించడానికి ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. రోజుకు లక్ష మందికి టీకా వేయడానికి ప్లాన్ వేస్తున్నామని అన్నారు. ఇక్కడ ప్రాధాన్యతావర్గాలకు టీకా వేయడం కోసం వ్యాక్సిన్ స్వీకరణ, నిల్వ సదుపాయాలు సిద్ధం చేశామని వివరించారు. హాస్పిటల్స్, హాస్పిటల్ సంబంధిత ఫెసిలిటీలనే వ్యాక్సినేషన్ కేంద్రాలుగా వినియోగించుకుంటామని పేర్కొన్నారు.