అమ్మాయి నంబర్ ప్లేట్‌లో ‘SEX’ .. వివరణ కోరిన ఉమన్ కమిషన్..
దిశ, ఫీచర్స్: రీసెంట్‌గా స్కూటీ తీసుకున్న ఢిల్లీకి చెందిన అమ్మాయికి ‘SEX’ లెటర్స్‌తో కూడిన రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించింది ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్. దీంతో తనపై టీజింగ్ ఎక్కువైపోయిందని.. జర్నీ చేస్తున్న సమయంలో తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్‌కు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిత్యావసర పనుల నిమిత్తం బయటకు కూడా వెళ్లలేకపోతున్నానని వాపోయింది. దీంతో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కమిషన్.. వెహికిల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను […]
దిశ, ఫీచర్స్: రీసెంట్‌గా స్కూటీ తీసుకున్న ఢిల్లీకి చెందిన అమ్మాయికి ‘SEX’ లెటర్స్‌తో కూడిన రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించింది ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్. దీంతో తనపై టీజింగ్ ఎక్కువైపోయిందని.. జర్నీ చేస్తున్న సమయంలో తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్‌కు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిత్యావసర పనుల నిమిత్తం బయటకు కూడా వెళ్లలేకపోతున్నానని వాపోయింది.
దీంతో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కమిషన్.. వెహికిల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను వెంటనే మార్చాలని రవాణా శాఖకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ‘SEX’ అనే సిరీస్‌పై రిజిస్టర్ అయిన మొత్తం వాహనాల సంఖ్యను సమర్పించాలని కోరింది. డిపార్ట్‌మెంట్‌కు అందిన అన్ని ఫిర్యాదుల వివరాలను కూడా కోరిన కమిషన్.. ఈ వ్యవహారంపై నాలుగు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది.