ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీ.. రైడర్స్‌పై పృథ్వీ ‘షా’ రైజింగ్

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. మరో 21 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో కేకేఆర్‌ను చిత్తుచేసింది. 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. ముఖ్యంగా ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా కేకేఆర్‌పై నిప్పులు చెరిగాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌలర్లను బెంబేలెత్తించాడు. కేవలం 41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో (82) పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పృథ్వీకి తోడుగా మరో […]

Update: 2021-04-29 11:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. మరో 21 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో కేకేఆర్‌ను చిత్తుచేసింది. 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. ముఖ్యంగా ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా కేకేఆర్‌పై నిప్పులు చెరిగాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌలర్లను బెంబేలెత్తించాడు. కేవలం 41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో (82) పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పృథ్వీకి తోడుగా మరో ఓపెనర్ గబ్బర్ (46) పరుగులతో రాణించాడు. వీరిద్దరు కలిసి 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమ్ విజయానికి మంచి ఇన్నింగ్స్ అందించారు. వీరి తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (16) పరుగులకే వెనుదిరిగాడు.. స్టోయినిస్ (6) పరుగులు చేసి జట్టును గెలిపించాడు. హెట్‌మెయర్‌ (0 నాటౌట్‌) క్రీజులో ఉన్నాడు. మొత్తం 16.3 ఓవర్లలో 156 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

Tags:    

Similar News