ఖర్చు తగ్గించుకునే పనిలో సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్

దిశ, స్పోర్ట్స్: కరోనా(corona) కారణంగా ఐపీఎల్ 13వ సీజన్(IPL 13th season) యూఏఈకి తరలిపోవడంతో ఫ్రాంచైజీలకు(Franchises) ఖర్చు భారీగా పెరిగిపోయింది. బీసీసీఐ(BCCI) నిర్ధేశించిన స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (SOP)లను అనుసరించడంతోపాటు ఆటగాళ్ల తరలింపునకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాల్సి రావడంతో ఈసారి నిధులు ఎక్కువగా వెచ్చించాల్సి వస్తున్నది. దీంతో కొన్ని ఫ్రాంచైజీలు(Franchises) ఖర్చులు తగ్గించుకునే మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్లు తమ ఆటగాళ్లను ఓకే చార్టడ్ […]

Update: 2020-08-12 08:31 GMT

దిశ, స్పోర్ట్స్: కరోనా(corona) కారణంగా ఐపీఎల్ 13వ సీజన్(IPL 13th season) యూఏఈకి తరలిపోవడంతో ఫ్రాంచైజీలకు(Franchises) ఖర్చు భారీగా పెరిగిపోయింది. బీసీసీఐ(BCCI) నిర్ధేశించిన స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (SOP)లను అనుసరించడంతోపాటు ఆటగాళ్ల తరలింపునకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాల్సి రావడంతో ఈసారి నిధులు ఎక్కువగా వెచ్చించాల్సి వస్తున్నది.

దీంతో కొన్ని ఫ్రాంచైజీలు(Franchises) ఖర్చులు తగ్గించుకునే మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్లు తమ ఆటగాళ్లను ఓకే చార్టడ్ ఫ్లైట్‌(Chartered Flight)లో యూఏఈకి తరలించాలని నిర్ణయించాయి. ఈ నెల 23న ఇరు జట్లు యూఏఈకి ప్రయాణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్‌(IPL)లోని అన్ని జట్లు ఆగస్టు 24లోపు యూఏఈ చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు మినహా ఏ ఫ్రాంచైజీ కూడా తమ ప్రయాణ వివరాలను అధికారికంగా ప్రకటించలేదు.

ఏ జట్టు ఎప్పుడు

– ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఆగస్టు 23న ఓకే విమానంలో ముంబై నుంచి యూఏఈకి వెళ్తాయి.
– సీఎస్కే(CSK) జట్టు ఈ నెల 21న చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనుంది.
– ముంబై ఇండియన్స్(MI) జట్టు ఈ నెల 21న ముంబై నుంచి బయలు దేరనుంది.
– కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్టు ఈ నెల 21 లేదా 22న ముంబై నుంచి యూఏఈకి(UAE) వెళ్లనుంది
– రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు ముంబై నుంచి ఈ నెల 22న యూఏఈ వెళ్లనుంది.
– రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు ఈ నెల 23న బెంగళూరు నుంచి అబుదాబి ప్రయాణం కానుంది
– కింగ్స్ ఎలెవెన్ పంజాబ్(Kings XI Punjab) జట్టు ఢిల్లీ నుంచి చార్టెడ్ ఫ్లయిట్ ద్వారా యూఏఈ వెళ్లనుంది. అయితే ఏ రోజు అనేది ఇంకా ఖరారు కాలేదు.

Tags:    

Similar News