మనిషి దూరమైనా..అతని జ్ఞాపకాలు వెంటాడాయి
దిశ, కరీంనగర్: తమతో కలిసి చదువుకున్న తోటి మిత్రుడు ప్రమాదవశాత్తు కారు ప్రమాదంలో మరణించినా..అతని జ్ఞాపకాలు వారిని వెంటాడాయి.ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాన్ని చూసి వారంతా చలించిపోయారు. అందరిలా కన్నీళ్లు కార్చి..సంతాపం ప్రకటించి చేతులు దులుపుకోలేదు. తమ వంతు సాయం చేసి బాధిత కుటుంబానికి అండగా నిలవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా స్థానిక మంత్రి చేతుల మీదుగా రూ.4లక్షలు అందజేసి మానవతా థృక్పతాన్ని చాటుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..నాలుగు నెలల […]
దిశ, కరీంనగర్:
తమతో కలిసి చదువుకున్న తోటి మిత్రుడు ప్రమాదవశాత్తు కారు ప్రమాదంలో మరణించినా..అతని జ్ఞాపకాలు వారిని వెంటాడాయి.ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాన్ని చూసి వారంతా చలించిపోయారు. అందరిలా కన్నీళ్లు కార్చి..సంతాపం ప్రకటించి చేతులు దులుపుకోలేదు. తమ వంతు సాయం చేసి బాధిత కుటుంబానికి అండగా నిలవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా స్థానిక మంత్రి చేతుల మీదుగా రూ.4లక్షలు అందజేసి మానవతా థృక్పతాన్ని చాటుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..నాలుగు నెలల కిందట కరీంనగర్‌లోని అల్గునూరు వంతెన వద్ద అదుపుతప్పి కారు నదిలో పడిపోయింది.ఈ ఘటనలో గండి శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. శ్రీనివాస్ ఇంటికి పెద్దదిక్కు కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.విషయం తెలుసుకున్న శ్రీనివాస్ డిగ్రీ క్లాస్ మెట్స్ తమ వంతు సాయంగా రూ. 4 లక్షలు అందజేశారు. 1990, 1993 డిగ్రీ బ్యాచ్‌కు చెందిన వీరంతా మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా అతని భార్య స్వరూపకు ఇప్పించారు.ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ..శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా కూడా సాయం అందించేందుకు తోడ్పాటు అందిస్తానని ప్రకటించారు.