అంత్యక్రియలకు ధరించిన దుస్తులను వేలం వేసిన దీపికా.. నెటిజన్ల ఫైర్
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ‘ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’కు మద్దతుగా తన దుస్తులను విక్రయిస్తుందని తెలిసిందే. ఈ క్రమంలో రెండు కుర్తాలను సేల్కు పెట్టింది. అయితే వీటిలో ఒకటి జియాఖాన్ అంత్యక్రియలకు హాజరైనప్పుడు ధరించింది కాగా మరొకటి 2013లో ప్రియాంక చోప్రా తండ్రి ప్రేయర్ మీటింగ్కు అటెండ్ అయినప్పుడు వేసుకుంది. దీంతో ఇలాంటి దుస్తులను సేల్కు పెట్టడంపై మండిపడ్డారు నెటిజన్లు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ దుస్తులను వేలానికి పెట్టేబదులు.. అవసరమున్న […]
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ‘ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’కు మద్దతుగా తన దుస్తులను విక్రయిస్తుందని తెలిసిందే. ఈ క్రమంలో రెండు కుర్తాలను సేల్కు పెట్టింది. అయితే వీటిలో ఒకటి జియాఖాన్ అంత్యక్రియలకు హాజరైనప్పుడు ధరించింది కాగా మరొకటి 2013లో ప్రియాంక చోప్రా తండ్రి ప్రేయర్ మీటింగ్కు అటెండ్ అయినప్పుడు వేసుకుంది. దీంతో ఇలాంటి దుస్తులను సేల్కు పెట్టడంపై మండిపడ్డారు నెటిజన్లు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ దుస్తులను వేలానికి పెట్టేబదులు.. అవసరమున్న వారికి ఇవ్వొచ్చు కదా? మీ ఇంట్లో ఉన్న పనివారికి ఇవ్వకుండా ఇలా సేల్లో ఉంచాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. అయినా తన అభిమానులు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారని ఫైర్ అయ్యారు.