ఫ్లాష్… ఫ్లాష్.. ఈ నెల 16 నుంచి రైతుల అకౌంట్లోకి రూ.50 వేలు
దిశ, వెబ్‌డెస్క్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపింది. ఈ నెల 16 నుంచి రైతు రుణమాఫీ పథకం అమలు చేయనుంది. తొలుత రూ.50 వేలు లోపు రుణాలు ఉన్న రైతులకు పూర్తిగా మాఫీ చేయనుంది. ఆగస్టు 16 నుండి రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ చేయనుంది. ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ చేయనుంది. రైతు రుణమాఫీ పథకం అమలు చేయాలని ఇటీవల […]
దిశ, వెబ్‌డెస్క్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపింది. ఈ నెల 16 నుంచి రైతు రుణమాఫీ పథకం అమలు చేయనుంది. తొలుత రూ.50 వేలు లోపు రుణాలు ఉన్న రైతులకు పూర్తిగా మాఫీ చేయనుంది. ఆగస్టు 16 నుండి రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ చేయనుంది. ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ చేయనుంది.
రైతు రుణమాఫీ పథకం అమలు చేయాలని ఇటీవల కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు నెలలో రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులకు పూర్తిగా మాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటివరకు రూ.25 వేల లోపు ఉన్న పంట రుణాలను మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే ఇప్పుడు రూ.50 వేల లోపు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని నిర్ణయించింది. మిగతా రుణమాఫీ ప్రక్రియ కూడా దశలవారీగా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.