షర్మిల సిరిసిల్ల టూర్ వెనుక ఆంతర్యం ఇదేనా?

దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సిరిసిల్ల టూర్ వెనక ఆంతర్యం ఏంటీ అనే చర్చ ఇప్పుడు టీ పాలిటిక్స్‌లో జోరుగా సాగుతోంది. కోవిడ్ బాధిత కుటుంబాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నా.. షర్మిల సిరిసిల్లకే ప్రాధాన్యం ఇవ్వడం వెనక కారణాలు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ నియోజకవర్గం కాబట్టే వస్తుందనుకుంటున్నా.. అసలు కారణం వేరే ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి కొద్దిసేపట్లో సిరిసిల్లకు రానున్న వైఎస్ షర్మిల ఓ […]

Update: 2021-06-24 22:35 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సిరిసిల్ల టూర్ వెనక ఆంతర్యం ఏంటీ అనే చర్చ ఇప్పుడు టీ పాలిటిక్స్‌లో జోరుగా సాగుతోంది. కోవిడ్ బాధిత కుటుంబాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నా.. షర్మిల సిరిసిల్లకే ప్రాధాన్యం ఇవ్వడం వెనక కారణాలు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ నియోజకవర్గం కాబట్టే వస్తుందనుకుంటున్నా.. అసలు కారణం వేరే ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

మరి కొద్దిసేపట్లో సిరిసిల్లకు రానున్న వైఎస్ షర్మిల ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధి కుటుంబాన్ని పరామర్శించేందుకు మాత్రమే వస్తున్నట్టు సమాచారం. న్యూస్ ఛానెల్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒకరి కుటుంబంతో షర్మిలకు సాన్నిహిత్యం ఉంది. అయితే దీంతో పాటు మరిన్ని కరోనా బాధిత కుటుంబాలను కలిసేందుకు షర్మిల పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసేశారట. ఈ విషయం అంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గుప్పుమనడంతో.. అసలు కారణం ఇదా? అని అనుకుంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఉమ్మడి జిల్లాలోని ఎన్నో కుటుంబాలు అతలాకుతలం అయినా షర్మిల సిరిసిల్లనే ఎంచుకోవడం వెనక మూలం ఇదేనంటున్నాయి పార్టీ వర్గాలు. ఇందులో భాగంగా సింగరేణి ప్రాంతానికి చెందిన కార్మికులు కూడా ఆమెను కలిసేందుకు ప్రయత్నించగా.. హైదరాబాద్‌కు వద్దని కరీంనగర్‌లోనే కలుద్దామని చెప్పినట్టు సమాచారం. ఒకేసారి రెండు ప్రాంతాల్లో పర్యటించినట్టుగా అవుతుందని కరీంనగర్‌లోనూ ఆమె టూర్ ఫిక్స్ చేసేశారు.

చుక్కాని లేని నావ…

పురుడు పోసుకోకముందే అపసోపాలు పడ్తున్నట్టుగా తయారైంది జిల్లాలోని షర్మిల పార్టీ పరిస్థితి. బోటాబోటి నాయకులు మాత్రమే షర్మిల పార్టీలో చేరితే అందులోనూ వర్గపోరు మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు వేర్వేరు గ్రూపులు తయారై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. చివరకు పోలీస్ స్టేషన్ల వరకూ వీరి పంచాయితీ చేరినట్టుగా స్థానికులు చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News