‘31లోపు ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు చెల్లించాలి’
దిశ, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను ఈ నెల 31లోపు చెల్లించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది రూ.1800 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలని నిర్దేశించుకోగా, ఇప్పటివరకు రూ.1291.49కోట్లు వసూలైనట్టు తెలిపారు. ఇంకా రూ.508.51 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వివరించారు. మీ-సేవా, సిటిజన్ సర్వీస్ సెంటర్, ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఈ ట్యాక్స్‌లను చెల్లించొచ్చనీ, వాటి రుసుములను […]
దిశ, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను ఈ నెల 31లోపు చెల్లించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది రూ.1800 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలని నిర్దేశించుకోగా, ఇప్పటివరకు రూ.1291.49కోట్లు వసూలైనట్టు తెలిపారు. ఇంకా రూ.508.51 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వివరించారు. మీ-సేవా, సిటిజన్ సర్వీస్ సెంటర్, ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఈ ట్యాక్స్‌లను చెల్లించొచ్చనీ, వాటి రుసుములను జీహెచ్ఎంసీనే భరిస్తుందని పేర్కొన్నారు. చెల్లింపుల్లో ఏమైనా ఇబ్బందులుంటే సంబంధిత సర్కిల్ కార్యాలయాల్లోని డిప్యూటీ కమిషనర్లను సంప్రదించాలని సూచించారు.
Tags: property tax, dues, payments, ghmc, deadline, hyd, ghmc commissioner, ds lokesh kumar,