మిషన్ భగీరథ నీళ్లలో చనిపోయిన చేప పిల్లలు.. ఈ నీటిని తాగేదెలా..?
దిశ, ఆందోల్ : ఎక్కడైనా నల్లాల నుంచి నీళ్ళు వస్తాయి. కానీ జోగిపేటలోని ఓ కాలనీలో నల్లాల నుంచి చేప పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. నమ్మశక్యంగా లేకున్నా ఇదే నిజం.. జోగిపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శనివారం ఉదయం మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అయ్యాయి. కాలనీలోని విట్టల చారీ, రాము, శంకరయ్య, కాశీనాథ్, రాములు, యూసుఫ్‌తో పాటు పలువురి ఇండ్లలో ఉన్న నల్లాల నుంచి చేప పిల్లలు బయట పడటం విశేషం. ఇది గమనించిన కొందరు ఇరుగు […]
దిశ, ఆందోల్ : ఎక్కడైనా నల్లాల నుంచి నీళ్ళు వస్తాయి. కానీ జోగిపేటలోని ఓ కాలనీలో నల్లాల నుంచి చేప పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. నమ్మశక్యంగా లేకున్నా ఇదే నిజం.. జోగిపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శనివారం ఉదయం మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అయ్యాయి. కాలనీలోని విట్టల చారీ, రాము, శంకరయ్య, కాశీనాథ్, రాములు, యూసుఫ్‌తో పాటు పలువురి ఇండ్లలో ఉన్న నల్లాల నుంచి చేప పిల్లలు బయట పడటం విశేషం. ఇది గమనించిన కొందరు ఇరుగు పొరుగు వారి ఇండ్ల నల్లాలను పరిశీలించగా, అక్కడ కూడా చేప పిల్లలు బయటపడ్డాయి.
అంతే కాకుండా నీళ్ల నుంచి దుర్వాసన కూడా వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, అధికారులు నీళ్లలో చేపలు రావడం, దుర్వాసన రావడంపై ప్రజలు మండిపడుతున్నారు. సింగూరు వద్దనున్న ఫిల్టర్ హౌస్‌లో ఫిల్టర్ కాకుండానే నీటిని వదులుతున్నట్లుగా చేప పిల్లలు ప్రత్యక్షంతో బట్టబయలైందని పలువురు ఆరోపిస్తున్నారు.