‘రైతులకు ఆందోళన అవసరం లేదు.. ప్రతిగింజనూ కొంటాం’

దిశ, భువనగిరి: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని డీసీఓ పరిమళ అన్నారు. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి హన్మాపురం పీఏసీఎస్ నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని గరురవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని గాలి తగిలేలా చేసి ఆరబెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్శింహ్మ రైతులతో కలిసి వారు పడుతున్న […]

Update: 2021-05-20 05:49 GMT

దిశ, భువనగిరి: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని డీసీఓ పరిమళ అన్నారు. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి హన్మాపురం పీఏసీఎస్ నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని గరురవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని గాలి తగిలేలా చేసి ఆరబెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్శింహ్మ రైతులతో కలిసి వారు పడుతున్న బాధలను, కష్టాలను, పలు సమస్యలను అధికారులకు వివరించి పరిష్కరించాలని కోరారు.

Tags:    

Similar News