టెస్టుల్లో నటరాజన్ ఎలా రాణిస్తాడో తెలియదు : వార్నర్
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా లక్కీబాయ్ నటరాజన్ అనూహ్యంగా టెస్టు జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో నెట్ బౌలర్‌గా ఆసీస్ వచ్చిన నటరాజన్ ఏకంగా మూడు ఫార్మాట్లకు ఎంపికయ్యాడు. నటరాజన్ ఎంపిక పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అభినందనలు తెలిపాడు. కాగా, తన సహచర ఆటగాడిని దగ్గర నుంచి చూసిన వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. నటరాజన్ మంచి టీ20 బౌలర్.. ఆసీస్ గడ్డపై కూడా […]
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా లక్కీబాయ్ నటరాజన్ అనూహ్యంగా టెస్టు జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో నెట్ బౌలర్‌గా ఆసీస్ వచ్చిన నటరాజన్ ఏకంగా మూడు ఫార్మాట్లకు ఎంపికయ్యాడు. నటరాజన్ ఎంపిక పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అభినందనలు తెలిపాడు. కాగా, తన సహచర ఆటగాడిని దగ్గర నుంచి చూసిన వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
నటరాజన్ మంచి టీ20 బౌలర్.. ఆసీస్ గడ్డపై కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే టెస్టుల్లో ఎలా రాణిస్తాడో మాత్రం తెలియదు అన్నాడు. అతడి ఫస్ట్ క్లాస్, రంజీ గణాంకాలు ఏంటో నాకు తెలియదు.. అక్కడ ఎలా బౌలింగ్ చేశాడో ఏనాడూ చూడలేదు.. కానీ కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే తప్పకుండా టెస్టుల్లో కూడా రాణిస్తాడని వార్నర్ అభిప్రాయపడ్డాడు. మహ్మద్ సిరాజ్‌కు టీమ్ ఇండియా ఎలా మద్దతుగా నిలిచిందో.. నటరాజన్‌కు కూడా అలా సపోర్ట్ చేస్తే తప్పకుండా రాణిస్తాడని వార్నర్ అన్నాడు. ఈ నెల 7 నుంచి సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఆ మ్యాచ్ తుది జట్టులో నట్టూకి చోటు దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.