ఎన్నికల నుంచి తప్పుకుంటాం.. దాసోజు సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలు గ్రహించాలి.. కేసీఆర్, కేటీఆర్‌లు ఓటర్లను మోసం చేసేందుకు మళ్ళీ కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. గతంలో ఓటర్లను కుక్కలతో పోల్చిన సీఎం.. ఇప్పుడు అదే ఓట్ల కోసం ఇంటికి పిలిపించుకొని మరి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌ను ఓడిస్తే ప్రజల హక్కులు, జీతాలు నేరుగా ఇంటికేవస్తాయన్నారు. పీఆర్సీ కేసీఆర్ ఇచ్చే బిక్ష కాదని.. అది సహజంగా జరిగే ప్రక్రియ అని.. ఉద్యోగుల హక్కు అంటూ శ్రవణ్ పేర్కొన్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలు గ్రహించాలి.. కేసీఆర్, కేటీఆర్‌లు ఓటర్లను మోసం చేసేందుకు మళ్ళీ కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. గతంలో ఓటర్లను కుక్కలతో పోల్చిన సీఎం.. ఇప్పుడు అదే ఓట్ల కోసం ఇంటికి పిలిపించుకొని మరి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌ను ఓడిస్తే ప్రజల హక్కులు, జీతాలు నేరుగా ఇంటికేవస్తాయన్నారు. పీఆర్సీ కేసీఆర్ ఇచ్చే బిక్ష కాదని.. అది సహజంగా జరిగే ప్రక్రియ అని.. ఉద్యోగుల హక్కు అంటూ శ్రవణ్ పేర్కొన్నారు.
ఏపీలో 27 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే.. ఇక్కడ 29 శాతం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారన్నారు. మరి ఆ హామీ ఎక్కడపోయిందని నిలదీశారు. గతంలోనే 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని గుర్తు చేసిన ఆయన.. ప్రస్తుతం 45 శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేసీఆర్ 45 పర్సెంట్ ఇస్తామని చెప్పి.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటామని దాసోజు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ మోసపూరిత చర్యలకు ప్రజలు బలికావొద్దని.. ఒక్కసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెప్పుకొచ్చారు.