యూనివర్సిటీలకు వీసీలను నియమించాలి: దాసోజు శ్రవణ్
దిశ, తెలంగాణ బ్యూరో: యూనివర్సిటీల్లో వైస్ ఛాన్స్‌లర్లను నియమించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ కోరారు. కేసీఆర్‌కు ఫాంహౌస్‌పై ఉన్న శ్రద్ధ విశ్వవిద్యాలయాలపై లేదని ఆయన గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో విమర్శించారు. విశ్వవిద్యాలయాలను భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తూ కేసీఆర్ విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. వీసీలు లేకపోవడంతో యూనివర్సిటీలు పరిపాలనపరంగా అస్తవ్యస్తంగా మారాయన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నాశనం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున సీఎంకు, గవర్నర్‌కు […]
దిశ, తెలంగాణ బ్యూరో: యూనివర్సిటీల్లో వైస్ ఛాన్స్‌లర్లను నియమించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ కోరారు. కేసీఆర్‌కు ఫాంహౌస్‌పై ఉన్న శ్రద్ధ విశ్వవిద్యాలయాలపై లేదని ఆయన గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో విమర్శించారు. విశ్వవిద్యాలయాలను భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తూ కేసీఆర్ విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. వీసీలు లేకపోవడంతో యూనివర్సిటీలు పరిపాలనపరంగా అస్తవ్యస్తంగా మారాయన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నాశనం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున సీఎంకు, గవర్నర్‌కు అనేక వినతిపత్రాలు అందించామన్నారు. తమ లేఖలపై స్పందించిన గవర్నర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.