దర్భంగా కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చిన NIA

దిశ, వెబ్‌డెస్క్: దర్భంగా పేలుడు కేసులో హైదరాబాద్‌కు చెందిన మాలిక్ సోదరుల( నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్) కస్టడీ గడువు ముగిసింది. తాజాగా.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వారికి ఈనెల 23 వరకు రిమాండ్ విధించింది. కాగా, నిందితుల కస్టడీ సమయంలో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. పేలుళ్ల కుట్రకు మాస్టర్‌మైండ్ లష్కరే తోయిబా ముఖ్యనేత ఇక్బాల్ ఖానాయే అని నిర్ధారణకు వచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న ఇక్బాల్‌.. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్‌ సయిద్‌, అండర్‌ […]

Update: 2021-07-18 00:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: దర్భంగా పేలుడు కేసులో హైదరాబాద్‌కు చెందిన మాలిక్ సోదరుల( నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్) కస్టడీ గడువు ముగిసింది. తాజాగా.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వారికి ఈనెల 23 వరకు రిమాండ్ విధించింది. కాగా, నిందితుల కస్టడీ సమయంలో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. పేలుళ్ల కుట్రకు మాస్టర్‌మైండ్ లష్కరే తోయిబా ముఖ్యనేత ఇక్బాల్ ఖానాయే అని నిర్ధారణకు వచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న ఇక్బాల్‌.. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్‌ సయిద్‌, అండర్‌ వరల్డ్‌ డాన్‌ టైగర్‌ మొమెన్‌ ఆదేశాలతో భారత్‌లో పేలుళ్లకు కుట్రపన్నాడని దర్యాప్తులో తేల్చింది. ప్రమాదకర రసాయనాలతో బాంబులు తయారు చేసి, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగించాలన్నది ఇక్బాల్‌ వ్యూహమని గుర్తించింది. భారత్‌లో పేలుళ్లతో చేసే ఒక్కో విధ్వంసానికి మాలిక్ సోదరులకు రూ. కోటి నజరానా ప్రకటించినట్లు సమాచారం.

2012లో పాకిస్థాన్‌ వెళ్లినప్పుడు.. అఫ్ఘానిస్థాన్‌ సరిహద్దులో లష్కరే అగ్రనేతలను కలిసినట్లు నాసిర్‌ అంగీకరించాడని తెలిసింది. యూపీలోని షామ్లీ జిల్లా ఖైరానాలోని సలీం ఇంట్లోనే దర్భంగా రైలులో పేలుడుకు వ్యూహరచన జరిగిందని వెల్లడించారు. ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి ఇక్బాల్‌ ఖన్నా సోషల్‌మీడియా ద్వారా వాయిస్ కాల్స్ చేసి మాట్లాడారని వివరించారు. హాజీ సలీమ్‌కు ఇంటర్నెట్‌పై సరిగా అవగాహన లేకపోవడంతో ఖలీం అనే వ్యక్తి సాయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఖలీం సోషల్ మీడియా ఖాతా ద్వారా హాజీ సలీమ్ వాయిస్ కాల్స్ చేసినట్లు సమాచారం. డబ్బు ఆశతోనే తన సోదరుడు ఇమ్రాన్‌తో కలిసి బాంబులు తయారు చేసినట్లు చెప్పాడని తెలిసింది.

Tags:    

Similar News