కీసర ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. 40 నిమిషాల పాటు శ్రమిస్తే గానీ..!
దిశ, కీసర : మేడ్చల్ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓఆర్‌ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షామీర్ పేట్ వైపు నుంచి ఘట్కేసర్ వైపు వస్తున్న స్విఫ్ట్ కారు (AP 24 BE 4826)ను గూడ్స్ లారీ (WB 23 B 6148) వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో వాహనదారుడు అందులోనే చిక్కుకుపోయాడు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన లారీ డ్రైవర్ వెంటనే ఘటనా స్థలి నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల స్థానికులు […]
దిశ, కీసర : మేడ్చల్ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓఆర్‌ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షామీర్ పేట్ వైపు నుంచి ఘట్కేసర్ వైపు వస్తున్న స్విఫ్ట్ కారు (AP 24 BE 4826)ను గూడ్స్ లారీ (WB 23 B 6148) వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో వాహనదారుడు అందులోనే చిక్కుకుపోయాడు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన లారీ డ్రైవర్ వెంటనే ఘటనా స్థలి నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల స్థానికులు వెంటనే స్పందించి ఓఆర్‌ఆర్ పైకి వెళ్లి దాదాపు 40 నిమిషాల పాటు శ్రమించి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న సూరజ్ రెడ్డిని కాపాడారు.
సూరజ్ రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా. దసరా పండగ నేపథ్యంలో సొంత గ్రామానికి బయలుదేరినట్టు తెలిసింది. మూత్ర విసర్జన కోసం ఓఆర్‌ఆర్‌పై కారు ఆపడంతో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన సూరజ్ రెడ్డిని స్థానికంగా ఉన్న తులసి ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.