2021 మిస్టరీగా మోస్ట్ పాపులర్ నేమ్ ‘డేంజర్’
దిశ, ఫీచర్స్: బిడ్డ పుట్టేంత వరకు ఎంత ఎగ్జైట్‌మెంట్, ఒత్తిడి ఫీలవుతారో.. పుట్టిన తర్వాత ఆ బేబీకి సరైన పేరు సెలెక్ట్ చేసే విషయంలోనూ అంతే కేర్ తీసుకుంటారు పేరెంట్స్. ప్రతీ ఒక్కరు తమ చైల్డ్‌కు యూనిక్ నేమ్ ఉండాలనే కోరుకుంటారు. ఈ క్రమంలో మంచి పేరు సజెస్ట్ చేయమంటూ ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్‌కు టాస్క్‌లు విధిస్తుంటారు. ఈ నేపథ్యంలో స్పెషల్ నేమ్ కోసం తల్లిదండ్రులు పడే తపన వల్లనే ప్రత్యేకించి బేబీ నేమ్స్ కోసం వేల […]
దిశ, ఫీచర్స్: బిడ్డ పుట్టేంత వరకు ఎంత ఎగ్జైట్‌మెంట్, ఒత్తిడి ఫీలవుతారో.. పుట్టిన తర్వాత ఆ బేబీకి సరైన పేరు సెలెక్ట్ చేసే విషయంలోనూ అంతే కేర్ తీసుకుంటారు పేరెంట్స్. ప్రతీ ఒక్కరు తమ చైల్డ్‌కు యూనిక్ నేమ్ ఉండాలనే కోరుకుంటారు. ఈ క్రమంలో మంచి పేరు సజెస్ట్ చేయమంటూ ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్‌కు టాస్క్‌లు విధిస్తుంటారు.
ఈ నేపథ్యంలో స్పెషల్ నేమ్ కోసం తల్లిదండ్రులు పడే తపన వల్లనే ప్రత్యేకించి బేబీ నేమ్స్ కోసం వేల సంఖ్యలో వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. కాగా 70,000 పేర్లతో ఫేమస్ అయిన ‘నేమ్‌బెర్రీ’ అనే వెబ్‌సైట్ 2021లో ప్రపంచవ్యాప్తంగా జనాలు సెర్చ్ చేసిన మోస్ట్ పాపులర్ బేబీ పేర్లకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. అయితే ఇందులోని చాలా పేర్లు అర్థమవుతుండగా.. కొన్నింటిని చూస్తే మాత్రం తలబాదుకోక తప్పదు. అయితే ఒక పేరు మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌కు మించి పాపులర్ కావడం విశేషం.
ఈ మేరకు ప్రస్తుతం ఇండియాలో బేబీ బాయ్స్ నేమ్ లిస్టులో ‘డేంజర్’ ఫస్ట్ ప్లేస్ దక్కించుకోగా.. టాప్ ఫైవ్‌లో వరుసగా ‘ఆరవ్, ఆర్యన్, సాహిల్, రేయాన్ష్’ పేర్లు చోటు సంపాదించాయి. అమ్మాయిలకు సంబంధించి ‘అంజలి, రేష్మ్, కావ్య, కియారా, నిహారిక’ టాప్ ఫైవ్‌లో నిలిచాయి. అంతేకాదు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లోనూ ‘డేంజర్’ పేరు పాపులర్ కాగా, పాకిస్థాన్ ప్రజలు ఫస్ట్ చాయిస్ మాత్రం ‘లుడో’. అయితే ఇప్పటివరకు పాపులర్ పేర్లను పరిశీలిస్తే.. ఆయా దేశాల మత, జాతి వైవిధ్యాన్ని సూచిస్తుండగా, ‘డేంజర్’ విషయానికొస్తే అలాంటి భేదాలు లేకుండానే డిమాండ్ పెరగడం మాత్రం ఒకింత మిస్టరీనే.