‘డాన్స్ దీవానే’లో అదరగొట్టిన బాలీవుడ్ హీరోయిన్..

దిశ సినిమా: కలర్స్ షో ‘డాన్స్ దీవానే’ రెండు సీజన్లు పూర్తిచేసుకుని మూడో సీజన్‌లోకి ఘణంగా అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ వేదికపై బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్, టెలీవిజన్ స్టార్ మౌని రాయ్ చేసిన డ్యాన్స్ షోకే హైలెట్‌గా నిలిచింది. ఇక వేదికపై నృత్యం చేయడమే కాకుండా వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో ‘దిల్ గల్తి కర్ బైత హై’ సాంగ్‌ను ప్రమోట్ చేస్తూ చేసిన డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన […]

Update: 2021-09-25 06:31 GMT

దిశ సినిమా: కలర్స్ షో ‘డాన్స్ దీవానే’ రెండు సీజన్లు పూర్తిచేసుకుని మూడో సీజన్‌లోకి ఘణంగా అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ వేదికపై బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్, టెలీవిజన్ స్టార్ మౌని రాయ్ చేసిన డ్యాన్స్ షోకే హైలెట్‌గా నిలిచింది. ఇక వేదికపై నృత్యం చేయడమే కాకుండా వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో ‘దిల్ గల్తి కర్ బైత హై’ సాంగ్‌ను ప్రమోట్ చేస్తూ చేసిన డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మాధురి.. హమ్ ఆప్కే హే కౌన్ మూవీలోని ‘మాయే ని మాయే’ పాటపై డ్యాన్స్ చేయగా.. మౌని రాయ్ ‘ధక్ ధక్’ బీట్‌కు వేసిన స్టెప్పులతో చాలా అందంగా కనిపించారు.

ఇక ఈ వీడియో చివరలో నటుడు మాధురిని కౌగిలించుకోగా.. గాయకుడు జుబిన్ నౌటియాల్ మౌని దగ్గరకు పాడుకుంటూ రావడంతో షోలో నవ్వులు పూయించారు. చివరగా షో కంటెస్టెంట్‌లతో కలిసి ‘ఘర్ మోర్ పరదేశియా’ అనే కళంక్ పాటపై డ్యాన్స్ చేసిన విధానం వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.

Tags:    

Similar News