ఈ రోడ్డుపై ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం

దిశ, వెబ్‌డెస్క్: గత మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా అనేక చెరువులు, కుంటలు కట్టలు తెగి, రోడ్లపై వరద నీరు చేసి రహదారులన్నీ ధ్వంసం అయ్యాయి. ఇందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కుంకుడుపాముల గ్రామంలో వర్షాల కారణంగా రోడ్లపై భారీగా వరదనీరు చేసి, రోడ్లు గుంతలమయంగా మరింది. ఈ మార్గం గుండా రాత్రి సమయంలో ప్రయాణం చేయాలంటే స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా […]

Update: 2021-01-11 06:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా అనేక చెరువులు, కుంటలు కట్టలు తెగి, రోడ్లపై వరద నీరు చేసి రహదారులన్నీ ధ్వంసం అయ్యాయి. ఇందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కుంకుడుపాముల గ్రామంలో వర్షాల కారణంగా రోడ్లపై భారీగా వరదనీరు చేసి, రోడ్లు గుంతలమయంగా మరింది. ఈ మార్గం గుండా రాత్రి సమయంలో ప్రయాణం చేయాలంటే స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిని సందర్శించిన పాపాన పోలేదని మండిపడుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు తిరిగే ఈ మార్గాన్ని మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News