IPL : SRH సంచలన నిర్ణయం.. అతనే బౌలింగ్ కోచ్..!
దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్-13లో SRH టీం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. పేలవ ప్రదర్శనతో పాంయిట్స్ టేటుల్లో చివరి స్థానంలో నిలిచింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో విఫలమైన SRH.. ఆ సీజన్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆరు పాయింట్స్ సాధించింది. దీంతో టేబుల్ చివరి స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో 2021లో రిటైన్ ప్రక్రియలో భాగంగా కేవలం జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమర్ మాలిక్‌ను మాత్రమే తీసుకుంది. ఇక, 2022 […]
దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్-13లో SRH టీం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. పేలవ ప్రదర్శనతో పాంయిట్స్ టేటుల్లో చివరి స్థానంలో నిలిచింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో విఫలమైన SRH.. ఆ సీజన్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆరు పాయింట్స్ సాధించింది. దీంతో టేబుల్ చివరి స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో 2021లో రిటైన్ ప్రక్రియలో భాగంగా కేవలం జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమర్ మాలిక్‌ను మాత్రమే తీసుకుంది.
ఇక, 2022 సీజన్‌పై ఇప్పటి నుంచే SRH ఫ్రాంచైజీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించింది. వచ్చే సీజన్‌కు స్టెయిన్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. కాగా, మళ్లీ టామ్ మూడీ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మూడీ కోచ్‌గా ఉన్నప్పుడే 2016లో సన్‌రైజర్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్ పేలవమైన ప్రదర్శన నేపథ్యంలో చీఫ్ కోచ్ ట్రెవర్ బెయిలీస్, సహాయక కోచ్ బ్రాడ్ హాడిన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.