డిమార్ట్, అదానీ గ్రూపు సంస్థల విరాళం!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా పెరుగుతున్న కరోనాను ఎదుర్కొనేందుకు అనేక సంస్థలు విరాళాలను ప్రకటించాయి. ఇప్పటికే అనేకమంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి సాయంగా తమ వంతు సాయాన్ని అందించారు. ఈ జాబితాలో సూపర్ మార్ట్స్ దిగ్గజం, అవెన్యూ సూపర్ మార్ట్స్ అధినేత రాధాకిషన్ దమాని కూడా చేరారు. కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు గానూ ఆయన రూ. 155 కోట్లను ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇందులో రూ. వంద కోట్లను పీఎమ్ కేర్స్‌కు ఇవ్వనుండగా, కరోనా ప్రభావం అధికంగా ఉండే […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా పెరుగుతున్న కరోనాను ఎదుర్కొనేందుకు అనేక సంస్థలు విరాళాలను ప్రకటించాయి. ఇప్పటికే అనేకమంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి సాయంగా తమ వంతు సాయాన్ని అందించారు. ఈ జాబితాలో సూపర్ మార్ట్స్ దిగ్గజం, అవెన్యూ సూపర్ మార్ట్స్ అధినేత రాధాకిషన్ దమాని కూడా చేరారు. కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు గానూ ఆయన రూ. 155 కోట్లను ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇందులో రూ. వంద కోట్లను పీఎమ్ కేర్స్‌కు ఇవ్వనుండగా, కరోనా ప్రభావం అధికంగా ఉండే రాష్ట్రాలకు రూ. 55 కోట్లను ప్రకటించారు. రాష్ట్రాల వారిగా ఆయన ఇచ్చిన విరాళాలు…గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలకు చెరో రూ. 5 కోట్లు, చత్తీస్‌ఘడ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో రాష్ట్రానికి రూ. 2.5 కోట్లు ఇవ్వనున్నట్టు వివరించారు.
డీమార్ట్‌తో పాటు పీఎమ్ కేర్స్ నిధికి అదానీ గ్రూపు సంస్థ రూ. వంద కోట్లు ఇవ్వగా, ఆ గ్రూపు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు రూ. 4 కోట్లను విరాళంగా అందజేశారు. అలాగే, దేశీయ సంస్థ సీ కే బిర్లా గ్రూపు రూ. 35 కోట్ల విరాళాన్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఇది కాకుండా రాష్ట్రాల ప్రభుత్వాలకు సాయంగా ఉండేందుకు వైద్య పరికరాల కోసం రూ. 10 కోట్లను సాయంగా ఇవ్వనున్నారు.
Tags: D-mart, fund to central, adani group, ck birla