‘నేను బట్టలు విప్పేశాను.. నువ్వు కూడా విప్పు’

దిశ, మాహబూబాబాద్: ‘నేను బట్టలు విప్పేశాను.. ఇంకెంత సేపు.. నువ్వు కూడా విప్పు’ అంటూ సైబర్ నేరగాళ్లు, ఆకతాయిలు సాధారణంగా అమ్మాయిలు, ఆంటీలను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతుంటారు. డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటనలు ఇప్పటికే చాలా సార్లు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కానీ, ఇక్కడ మాత్రం సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకున్నారు. పెండ్లి అయినా అంకుల్స్‌ను టార్గెట్ చేసుకొని వీడియో కాల్స్ చేస్తూ మభ్యపెట్టారు. ఇదే క్రమంలో పురుషుల నగ్న వీడియోలను సేకరించి […]

Update: 2021-04-24 03:25 GMT

దిశ, మాహబూబాబాద్: ‘నేను బట్టలు విప్పేశాను.. ఇంకెంత సేపు.. నువ్వు కూడా విప్పు’ అంటూ సైబర్ నేరగాళ్లు, ఆకతాయిలు సాధారణంగా అమ్మాయిలు, ఆంటీలను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతుంటారు. డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటనలు ఇప్పటికే చాలా సార్లు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కానీ, ఇక్కడ మాత్రం సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకున్నారు. పెండ్లి అయినా అంకుల్స్‌ను టార్గెట్ చేసుకొని వీడియో కాల్స్ చేస్తూ మభ్యపెట్టారు. ఇదే క్రమంలో పురుషుల నగ్న వీడియోలను సేకరించి బ్లాక్ మెయిల్ చేశారు.

అమ్మాయిల్లాగానే చాట్ చేస్తూ పోర్న్, న్యూడ్ వీడియోలను కూడా సదరు అంకుల్స్‌కు సెండ్ చేశారు. సైబర్ నేరగాళ్ల మోసాన్ని గ్రహించని సదరు వ్యక్తులు ఓపెన్ అయిపోయారు. తరచూ వీడియో కాల్స్ చేస్తూ నగ్న ప్రదర్శన చేయసాగారు. ఇక ఈ వీడియోలను మొత్తం సెల్‌ఫోన్‌లో రికార్డు చేసుకున్న సైబర్ క్రిమినల్స్.. అవే వీడియోలను చూపుతూ బ్లాక్ మెయిల్ చేశారు. కుటుంబీకులతో పాటు స్నేహితులకు నగ్న వీడియోలు సెండ్ చేసి పరువు తీస్తామని బెదిరించారు. డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దిక్కుతోచని స్థితిలో మోసపోయిన నలుగురు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు. ఇదే కేసుపై సీఐ వెంకటరత్నం మాట్లాడుతూ ఆన్‌లైన్ కాల్స్‌పై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అపరిచిత ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, ఓటీపీలు, గుర్తు తెలియని లింక్‌ల పట్ల దూరంగా ఉండాలన్నారు.

Tags:    

Similar News