జియో సిమ్ బ్లాక్ అంటూ సైబర్ మోసం
దిశ, క్రైమ్ బ్యూరో : మీ సిమ్ బ్లాక్ అవుతుందంటూ.. జియో కస్టమర్లను మోసగించిన సైబర్ మోసగాళ్లపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదయ్యింది. రీచార్జ్ చేయాలంటూ, లేదంటే.. మీ సిమ్ బ్లాక్ అవుతుందంటూ సదరు మోసగాడు నమ్మబలికాడు. ఆ తర్వాత రీచార్జ్ కావడం లేదనే పేరుతో క్విక్ సపోర్ట్ యాప్‌ను డౌన్ లోడ్ చేయించాడు. అనంతరం రీచార్జ్ నిమిత్తం కార్డు ద్వారా రూ.10 లు చెల్లించాలని చెప్పడంతో బాధితులు అలాగే చేశారు. దీంతో క్విక్ సపోర్ట్ యాప్ […]
దిశ, క్రైమ్ బ్యూరో : మీ సిమ్ బ్లాక్ అవుతుందంటూ.. జియో కస్టమర్లను మోసగించిన సైబర్ మోసగాళ్లపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదయ్యింది. రీచార్జ్ చేయాలంటూ, లేదంటే.. మీ సిమ్ బ్లాక్ అవుతుందంటూ సదరు మోసగాడు నమ్మబలికాడు. ఆ తర్వాత రీచార్జ్ కావడం లేదనే పేరుతో క్విక్ సపోర్ట్ యాప్‌ను డౌన్ లోడ్ చేయించాడు. అనంతరం రీచార్జ్ నిమిత్తం కార్డు ద్వారా రూ.10 లు చెల్లించాలని చెప్పడంతో బాధితులు అలాగే చేశారు. దీంతో క్విక్ సపోర్ట్ యాప్ ద్వారా కార్డు నెంబర్ గమనించిన కేటుగాడు.. ఇద్దరు మహిళల అకౌంట్ నుంచి రూ.2.7 లక్షలను కాజేశాడు.
ఇదిలా ఉండగా, క్యూఆర్ కోడ్ పేరుతో రూ.4.5 లక్షలు మోసపోయినట్టుగా 6 గురి నుంచి సీసీఎస్ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. తన ఖాతా నుంచి రూ.6 లక్షలు మాయం అయినట్టుగా మరో మహిళ ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా కస్టమర్లను ఇప్పిస్తామని చెప్పి ఓ ఎల్ఐసీ ఏజెంట్ నుంచి రూ.86 వేలను కాజేసినట్టుగా పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.