క్లోజ్ అయ్యి..రూ.11 లక్షలు కొట్టేసింది

దిశ, వెబ్ డెస్క్: సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమాయకులను టార్గెట్ చేసి లక్షలు వసూలు చేస్తున్నారు. ఫేస్ బుక్ ద్వారా అందమైన అమ్మాయి ప్రొఫైల్ పిక్, హాయ్ అంటూ ఓ మెసేజ్. నెమ్మదిగా మాయ మాటలతో పరిచయం పెంచుకుంటారు. బ్యాంక్ ఉద్యోగినంటూ మెసెంజర్ ద్వారా మెసేజ్‌లతో బురిడీ కొట్టిస్తారు. క్లోజ్‌గా మూవ్ అవుతూ.. వ్యక్తిగత వివరాలు తెలుసుకొని మనలో వీక్ నెస్‌ను గుర్తించి సెంటిమెంట్ డైలాగ్స్‌తో బాధితుడి దగ్గర నుంచి అందినకాడికి దోచుకొని […]

Update: 2020-07-10 11:34 GMT

దిశ, వెబ్ డెస్క్: సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమాయకులను టార్గెట్ చేసి లక్షలు వసూలు చేస్తున్నారు. ఫేస్ బుక్ ద్వారా అందమైన అమ్మాయి ప్రొఫైల్ పిక్, హాయ్ అంటూ ఓ మెసేజ్. నెమ్మదిగా మాయ మాటలతో పరిచయం పెంచుకుంటారు. బ్యాంక్ ఉద్యోగినంటూ మెసెంజర్ ద్వారా మెసేజ్‌లతో బురిడీ కొట్టిస్తారు. క్లోజ్‌గా మూవ్ అవుతూ.. వ్యక్తిగత వివరాలు తెలుసుకొని మనలో వీక్ నెస్‌ను గుర్తించి సెంటిమెంట్ డైలాగ్స్‌తో బాధితుడి దగ్గర నుంచి అందినకాడికి దోచుకొని వర్కవుట్ అయ్యాక అకౌంట్ బ్లాక్ చేసేస్తారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు దర్జాగా చేస్తోన్న ఇంటర్నేషనల్ దందా ఇది.

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన నాగిల్ల లక్ష్మణ్ రావు రియల్ ఎస్టేట్ వ్యాపారి. జనవరిలో ఫేస్ బుక్‌లో ఓ లండన్ లేడీ (తమర బెన్ సెట్టి) పరిచయమయ్యింది. తాను లండన్‌లో ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్ననంటూ మెసేజ్‌లు చేస్తూ మాయ మాటలు చెప్పి పరిచయం పెంచుకుంది. లక్ష్మణ్ రావు ఆమెతో చాటింగ్ చేశాడు. ఈ క్రమంలో లక్ష్మణ్ రావు వ్యక్తిగత వివరాలు చెప్పాడు. లక్ష్మణ్ రావుకు మాయ మాటలు చెప్పి విడతల వారీగా అతని దగ్గర 11 లక్షలు ఖాజేసింది.

11 లక్షలు ఇచ్చి మోసపోయామని తెలుసుకున్న భాధితుడు తేరుకునే సరికి ఆ మాయ లేడీ మొబైల్, ఫేస్ బుక్ అకౌంట్ రెండు బ్లాక్ చేసేసింది. దీంతో లబోదిబోమంటూ చిట్యాల పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు లక్ష్మణ్. తాను అప్పులు తెచ్చి లండన్ లేడి కి రూ.11 లక్షలు ఇచ్చి మోసపోయాయని తనకు అప్పులు ఇచ్చిన వారు తమ డబ్బు తమకు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని లక్ష్మణ్ చెబుతున్నారు. బాధితుడి ఫిర్యాదుతో చిట్యాల పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News