అమ్మకానికి 14.2 కోట్ల మంది వ్యక్తిగత డేటా! ట్విట్టర్ సీఈవోది కూడా..

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత సమాచారానికి రక్షణ లేకుండా పోతోంది. వివిధ మార్గాల ద్వారా కోట్లాది మంది డేటాను హ్యాకర్లు కొల్లగొడుతున్నారు. తిరిగి వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చాలానే వెలుగుచూశాయి. తాజాగా డార్క్‌వెబ్ ద్వారా 14.2 కోట్ల మంది డేటాను అమ్మకానికి పెట్టారు. అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఉన్న ఎంజీఎం రిసార్ట్స్ హోటల్స్‌లో బస చేసిన వారి డేటాను మన కరెన్సీలో రూ. 2.18 లక్షలకు అమ్మకానికి […]

Update: 2020-07-15 04:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత సమాచారానికి రక్షణ లేకుండా పోతోంది. వివిధ మార్గాల ద్వారా కోట్లాది మంది డేటాను హ్యాకర్లు కొల్లగొడుతున్నారు. తిరిగి వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చాలానే వెలుగుచూశాయి. తాజాగా డార్క్‌వెబ్ ద్వారా 14.2 కోట్ల మంది డేటాను అమ్మకానికి పెట్టారు. అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఉన్న ఎంజీఎం రిసార్ట్స్ హోటల్స్‌లో బస చేసిన వారి డేటాను మన కరెన్సీలో రూ. 2.18 లక్షలకు అమ్మకానికి డీల్ కుదుర్చుకున్నారు. డేటా హ్యాకింగ్‌కు సమాచారం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బయటకు వచ్చింది. అమ్మకానికి పెట్టిన డేటా ప్రకారం.. 2019లో కేసినో కేపిటల్ లాస్‌వెగాస్‌లో బస చేసిన సెలబ్రిటీలు, టెక్ సీఈవోలు, టెక్ ఉద్యోగులు, రిపోర్టర్లు, ప్రభుత్వ అధికారులు, తదితరులు ఆ లిస్టులో ఉన్నారు.

హ్యాక్ అయిన డేటాలో పూర్తి పేర్లు, ఇంటి చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఈ మెయిల్స్, పుట్టిన తేదీలు తదితర వివరాలు ఉన్నాయి. అమ్మకానికి రెడీగా ఉన్న డేటాలో ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ, పాప్‌స్టార్ జస్టిన్ బీబర్ వంటి ప్రముఖుల డేటా కూడా ఉన్నట్లు సమాచారం. లాస్ వెగాస్‌లోని ఎంజీఎం రిసార్ట్స్‌లో బెల్లాగియో, ఆరియా, ఎంజీఎం గ్రాండ్, మాండలే బే, పార్క్ ఎంజీఎం, మిరేజ్, లగ్జర్, ఎక్స్ క్యాలిబర్ వంటి సంస్థలున్నాయి.

Tags:    

Similar News