బ్యాంకుల వద్ద ‘‘జన్’’ ధన్ క్యూ
దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ (కొవిడ్ -19) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సందర్భంగా అవస్థలు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు సహాయక చర్యలు తీసుకుంటోంది. సామాజిక దూరం పాటించాలని నిర్దేశిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డుదారులకు బియ్యంతో పాటు కేంద్రం రూ.500లు, రాష్ట్రం రూ.1500లను అందజేస్తానంది. వీటి కోసం రేషన్ దుకాణాలు, బ్యాంకుల వద్దకు జనాలు పెద్ద ఎత్తున […]
దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ (కొవిడ్ -19) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సందర్భంగా అవస్థలు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు సహాయక చర్యలు తీసుకుంటోంది. సామాజిక దూరం పాటించాలని నిర్దేశిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డుదారులకు బియ్యంతో పాటు కేంద్రం రూ.500లు, రాష్ట్రం రూ.1500లను అందజేస్తానంది. వీటి కోసం రేషన్ దుకాణాలు, బ్యాంకుల వద్దకు జనాలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలెవరూ సామాజిక దూరం పాటించడం లేదు. ఇలా అయితే, కరోనా వైరస్ ఎలా కట్టడి అవుతుందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యంతో పాటు నిత్యావసరాల నిమిత్తం కుటుంబానికి రూ.1,500 అందజేస్తానన్నారు. ఇదే బాటలో కేంద్రం సైతం ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం, జన్ ధన్ ఖాతాదారులకు రూ.500లు జమ చేస్తానని చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటికే సివిల్ సప్లయ్ శాఖ రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ ప్రారంభించింది. ఇక రూ.1,500లను అకౌంట్‌లో జమ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం అందజేస్తానన్న 5 కిలోల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించే 12 కిలోల్లోనే అందినట్టుగా భావించాలా.. లేదా కేంద్రం 5 కిలోలు విడిగా పంపిణీ చేస్తారా అనే విషయాలపై అధికారుల్లో ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ప్రధాన మంత్రి మోడీ ముందస్తు చెప్పినట్టుగానే జన్ ధన్ మహిళా ఖాతాదారులకు రూ.500లను వారి అకౌంట్లలో జమ చేశారు.
బారులు తీరుతున్న జనం..
ప్రస్తుతం ఆహార భద్రత కార్డుదారులు బియ్యం తీసుకునేందుకు రేషన్ దుకాణాల వద్దకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 674 రేషన్ దుకాణాలతో పాటు అదనంగా మరో 18 కేంద్రాలలో బియ్యం పంపిణీ నిర్వహిస్తున్నారు. మొత్తం జిల్లాలో 5.80 లక్షల కార్డుదారులు ఉన్నారు. వీరికి తోడుగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు పోర్టబిలిటీ ద్వారా నగరంలోనూ బియ్యం ఇతర సదుపాయాలు పొందొచ్చు. కాగా, కేంద్రం మహిళా జన్ ధన్ ఖాతాదారులకు వేసిన రూ.500 తీసుకునేందుకు బ్యాంకులు వద్ద జనాలు బారులు తీరుతున్నారు. తమ డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు జన్ ధన్ ఖాతాదారులంతా పెద్ద ఎత్తున బ్యాంకుల వద్దకు వస్తున్నారు. అటు రేషన్ దుకాణాల వద్ద, ఇటు బ్యాంకుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించేందుకు ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీలో ఇప్పటికే కరోనా పాజిటివ్ సంఖ్యలు పెరుగుతున్నందున బ్యాంకులు, రేషన్ షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే ఇంకా విజృంభించే అవకాశముందనీ, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నా
Tags: jan dhan women account, customers, waiting, lockdown effect, pds shop