మహిళలను కించపరిచే పాఠ్యాంశాలను తొలగించాలి
దిశ, తెలంగాణ బ్యూరో: సీబీఎస్ఈ పాఠ్యాంశాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని, వాటిని తొలగించాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌టీఎఫ్ఐ) నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్టీఎఫ్ఐ కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం సంఘం అధ్యక్షుడు అభిజిత్ముఖర్జీ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి సీఎన్ భారతి మాట్లాడుతూ.. కేంద్రీకరణ, వ్యాపారీకరణలకు ఆస్కారం కల్పిస్తున్న జాతీయ విద్యా విధానం 2020 ని సమూలంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయత పేరుతో […]
దిశ, తెలంగాణ బ్యూరో: సీబీఎస్ఈ పాఠ్యాంశాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని, వాటిని తొలగించాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌టీఎఫ్ఐ) నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్టీఎఫ్ఐ కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం సంఘం అధ్యక్షుడు అభిజిత్ముఖర్జీ సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి సీఎన్ భారతి మాట్లాడుతూ.. కేంద్రీకరణ, వ్యాపారీకరణలకు ఆస్కారం కల్పిస్తున్న జాతీయ విద్యా విధానం 2020 ని సమూలంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయత పేరుతో పాఠశాలల స్థాయిలో విద్యార్థుల పసి మెదడులను కలుషితం చేసి ప్రజల మధ్య ఐక్యతకు చిచ్చుపెట్టే విధంగా కేంద్ర పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొవిడ్ కారణంగా విద్యా వ్యవస్థలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత శ్రద్ధ వహించాలన్నారు. సీబీఎస్ఈ సిలబస్ లో మహిళల ఎదుగుదలపై చేసిన వ్యాఖ్యలపై ఎస్ టీఎఫ్ఐ కేంద్ర కార్యవర్గ సమావేశం తీవ్రంగా ఖండించింది.
పాఠ్యాంశాల్లో ఆధిపత్య, అహంకార భావజాలాలను ప్రవేశపెట్టి మహిళలను కించపరచడం సిగ్గుచేటని పేర్కొంది. ఇదిలా ఉండగా గురువారం జరగనున్న జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించే పలు తీర్మానాలను కార్యవర్గ సమావేశంలో చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో ఎస్ టీఎఫ్ఐ ఉపాధ్యక్షుడు చావ రవి, ఎం.సంయుక్త, కే రాజేంద్రన్, ఎన్ వెంకటేశ్వర్లు, కోశాధికారి ప్రకాష్ చంద్ర మొహంతి, కార్యదర్శులు కేజే హరికుమార్, మహవీర్, బదర ఉన్నీసా, బదురుద్దోజా ఖాన్, కేపీ భట్టాచార్య, అరుణకుమారి, ఎస్ మైల్, సుకుమార్ పైన్, సుకాంత బెనర్జీ, హరిసింగ్, రేమండ్ ప్యాట్రిక్, శంకర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.