పాఠ్యాంశాలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా ఉండాలి

దిశ, తెలంగాణ బ్యూరో: సీబీఎస్ఈ సిలబస్​లో మహిళలను కించపరిచేలా ఉన్న పాఠ్యాంశాలను తొలగించాలని, పాఠ్యాంశాలంటే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా ఉండాలని జాతీయ మహిళా ఉపాధ్యాయుల ఫోరం నాయకులు అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర బేటీ బచావో.. బేటీ పడావో అంటూనే మహిళలను కించపరిచేలా పాఠ్యాంశాలకు రూపకల్పన చేయడంపై మండిపడ్డారు. సీబీఎస్ ఈ వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా విద్యార్థుల డ్రాపౌట్స్​ను పెంచేలా ఉన్న […]

Update: 2021-12-16 10:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీబీఎస్ఈ సిలబస్​లో మహిళలను కించపరిచేలా ఉన్న పాఠ్యాంశాలను తొలగించాలని, పాఠ్యాంశాలంటే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా ఉండాలని జాతీయ మహిళా ఉపాధ్యాయుల ఫోరం నాయకులు అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర బేటీ బచావో.. బేటీ పడావో అంటూనే మహిళలను కించపరిచేలా పాఠ్యాంశాలకు రూపకల్పన చేయడంపై మండిపడ్డారు. సీబీఎస్ ఈ వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు.

ఇదిలా ఉండగా విద్యార్థుల డ్రాపౌట్స్​ను పెంచేలా ఉన్న నూతన జాతీయ విద్యా విధానం 2020 అమలును నిలిపివేయాలని స్కూల్​ టీచర్స్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎన్​ భారతి డిమాండ్ ​చేశారు. కొవిడ్ ​అనంతరం దేశవ్యాప్తంగా పాఠశాలలో ప్రత్యేక బోధన ప్రారంభించాలని, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని వారు డిమాండ్​ చేశారు. ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది మార్చి 5న ఢిల్లీలో జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మే 14, 15, 16 తేదీల్లో విజయవాడలో ఎనిమిదో జాతీయ మహాసభలు నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్టీఎఫ్ఐ అధ్యక్షుడు అభిజిత్ ​ముఖర్జీ, ఉపాధ్యక్షుడు సంయుక్త, రాజేంద్రన్, టీఎస్​యూటీఎప్ ​రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News