ప్రభుత్వ ఉద్యోగార్థుల కోసం తెలంగాణ చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు
వేయి స్తంభాల గుడిని ఎవరు నిర్మించారు
1. వేయి స్తంభాల గుడిని ఎవరు నిర్మించారు?
ans. రుద్రదేవుడు
2. ఏ నిజాం పరిపాలన కాలంలో వహాబీ ఉద్యమం ప్రారంభమైంది?
ans. అఫ్జల్ ఉద్దౌలా
3. గౌతమీ బాలశ్రీ వేయించిన శాసనం?
ans. నాసిక్ శాసనం
4. శాతవాహనుల కాలంలో నిగమాలంటే ఏమిటి?
ans. పట్టణాలు
5. గోల్కొండ రాజ్యాన్ని మొగల్ సామ్రాజ్యంలో ఎప్పుడు విలీనం చేశారు?
ans. 1687
6. ముల్కీ ఉద్యమం అంటే ఏమిటి?
ans. ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం
7. తెలంగాణ పరిరక్షణ దినాన్ని ఎప్పుడు పాటించారు?
ans. 1968 జులై 10
8. 1857 తిరుగుబాటులో బ్రిటీష్ వారికి సహాయం చేసినందుకు గాను నిజాం నవాబు అఫ్జల్ ఉద్దౌలాకు ఎమని బిరుదునిచ్చారు?
ans. స్టార్ ఆఫ్ ఇండియా
9. తెలంగాణలో ముల్కీ నిబంధనలను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
ans. 1888
10. తెలంగాణలో మొదటగా చెరువులు తవ్వించిన కాకతీయ రాజు ఎవరు?
ans. మొదటి ప్రోలరాజు
11. పాకాల సరస్సు తవ్వించినది ఎవరు?
ans. జగదల ముమ్మడి నాయకుడు
12. కాకతీయులలో చివరి రాజు ఎవరు?
ans. ప్రతాప రుద్రుడు
13. తెలంగాణలో అసఫ్ జాహీల పాలన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
ans. 1724
14. గోల్కొండపై మొట్టమొదటి కోటను ఎవరు నిర్మించారు?
ans. కాకతీయులు
15. గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు ఎవరు?
ans. టావెర్నియర్
16. అసఫ్ జాహీల మొదటి రాజధాని ఏది?
ans. ఔరంగాబాద్
17. హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
ans. 1952
18. 1952 నాటి హైదరాబాద్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు?
ans. వి.డి. దేశ్‌పాండే
19. 1952లో ఎన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి?
ans. 175
20. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ ఎప్పుడు జరిగింది?
ans. 10 మార్చి, 2011