లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: స్పోర్ట్స్-రాష్ట్రాలు
ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మృతికి మూడో స్థానం
స్పోర్ట్స్:
ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మృతికి మూడో స్థానం:
భారత జట్టు ఓపెనర్ స్మృతి మంధాన కెరీర్ అత్యుత్తమ ర్యాంకింగ్ పాయింట్లు సాధించింది.
ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఆమె 741 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
ఆస్ట్రేలియాతో రెండో టీ20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకుంది.
ఈ మ్యాచ్ ద్వారా 11 రేటింగ్ పాయింట్లు రావడంతో ఈ మైలురాయిని చేరుకుంది.
భారత్‌తో తొలి రెండు టి20ల్లో సత్తాచాటిన తాలియా మెక్ గ్రాత్ (827 పాయింట్లు) నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంది.
బెత్ మూనీ (773 ఆస్ట్రేలియా) ద్వితీయ స్థానానికి పడిపోయింది.
గ్రాండ్ మాస్టర్‌గా ఆదిత్య:
యువ చెస్ ఆటగాడు ఆదిత్య మిట్టల్(ముంబయి) గ్రాండ్ మాస్టర్‌గా అవతరించాడు.
జీఎం టైటిల్ సాధించిన 77వ భారత క్రీడాకారుడిగా ఆదిత్య ఘనత అందుకున్నాడు.
స్పెయిన్‌లో జరుగుతున్న టోర్నీలో 16 ఏళ్ల ఆదిత్య 2500 ఎలో రేటింగ్ అధిగమించాడు.
రాష్ట్రాలు:
హైదరాబాద్‌లో అతిపెద్ద డేటా కేంద్రం:
సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ స్థిరాస్తి సంస్థ క్యాపిటల్యాండ్ తెలంగాణలో రూ. 6,200 కోట్ల పెట్టుబడులతో డేటా కేంద్రం నెలకొల్పనుంది.
దీనిని హైదరాబాద్‌లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది.
ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ (క్లింట్) తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
దేశంలోనే అతిపెద్ద డేటా కేంద్రంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు.
దేశంలో తొలి విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ కేంద్రం:
ప్రసిద్ధ బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా తెలంగాణలో తమ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది.
దేశంలోనే తొలి అత్యాధునిక విద్యుత్ వాహనాల బ్యాటరీ తయారీ కోసం లిథియం అయాన్ గిగా కర్మాగారాన్ని, పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పేందుకు ముందుకొచ్చింది.
మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లి పారిశ్రామిక పార్కులో రూ. 9,500 కోట్ల పెట్టుబడులతో దీనిని స్థాపించనుంది.
ఏపీకి జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు:
ఇంధన పొదుపు, సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది.
ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డును కేంద్ర ప్రభుత్వం అందించింది.
ఇంధన వినియోగం ఆధారంగా దేశంలోని రాష్ట్రాలను నాలుగు గ్రూపులుగా విభజించారు.
అందులోని 2వ గ్రూపులో ఉన్న ఏపీ, అత్యుత్తమ పనితీరు కనబరిచి తొలి స్థానంలో నిలిచి అవార్డును సొంతం చేసుకుంది.
ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖర్ రెడ్డిలు ఈ అవార్డును అందుకున్నారు.
ఏపీలో ఇంధన సామర్థ్యం, పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏపీఎస్ఈసీఎంకు ఇది ఐదో జాతీయ పురస్కారం కావడం విశేషం.