కరెంట్ అఫైర్స్-జాతీయం: 9-12-2022

గిన్నిస్ రికార్డు సాధించిన నాగ్‌పూర్ మెట్రో

Update: 2022-12-09 13:49 GMT

గిన్నిస్ రికార్డు సాధించిన నాగ్‌పూర్ మెట్రో:

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రో గిన్నిస్ రికార్డు సాధించింది.

ఇక్కడి 3.14 కిలోమీటర్ల డబుల్ డెకర్ వయాడక్ట్ మెట్రో ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తింపు పొందింది.

ఇది వార్థా రోడ్ ప్రాంతంలో ఉంది.

ఈ డబుల్ డెకర్ వయాడక్ట్ ఇప్పిటకే ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణంగా గుర్తింపు పొందింది.

దీని పైభాగంలో మెట్రో రైలు, మధ్యలో హైవే ఫ్లైఓవర్ ఉన్నాయని మహా మెట్రో ఎండీ బ్రిజేష్ దీక్షిత్ వివరించారు.

బీబీసీ ప్రభావశీల మహిళల్లో నలుగురు భారతీయులు:

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధిక ప్రభావం చూపిన 100 మంది ప్రభావశీల మహిళలతో ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన జాబితాలో నలుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు.

ప్రముఖ నటి -నిర్మాత ప్రియాంక చోప్రా జోనాస్

ఏరోనాటికల్ ఇంజనీర్ శిరీష్ బండ్ల,

బుకర్ ప్రైజ్ విజేత గీతాంజలి,

శ్రీ సామాజిక ఉద్యమానికి.. స్నేహ జవాలేలు ఇందులో స్థానం సంపాదించారు.

ఈ సంజీవనిలో తొలి స్థానంలో ఏపీ:

ఈ సంజీవని (ఉచిత టెలిమెడిసిన్ సర్వీస్) దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8 కోట్ల మంది వినియోగించుకోగా 2.82 కోట్ల కాలర్లతో ఏపీ తొలి స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

ఈ సంజీవని స్థానాలు:

1వ స్థానం ఆంధ్రప్రదేశ్ (2.82కోట్లు)

2వ స్థానం పశ్చిమ బెంగాల్ (1 కోటి)

3వ స్థానం కర్ణాటక (94.46 లక్షలు)

4వ స్థానం తమిళనాడు (87.23లక్షలు)

5వ స్థానం మహారాష్ట్ర (40.70 లక్షలు)

6వ స్థానం ఉత్తరప్రదేశ్ (37.63 లక్షలు)

7వ స్థానం మధ్యప్రదేశ్ (32.83 లక్షలు )

8వ స్థానం బీహార్ (26.24 లక్షలు)

9వ స్థానం తెలంగాణ (24.52 లక్షలు)

10వ స్థానం గుజరాత్ ( 16.73 లక్షలు)


Similar News