లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 3-30-23
షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్‌కు భారత్ ఆతిథ్యం
షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్‌కు భారత్ ఆతిథ్యం:
భారతదేశం న్యూఢిల్లీలో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ - జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ సమావేశం మార్చి 29న న్యూఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారులుతో నిర్వహించింది.
ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ప్రసంగించారు.
ఈ సమావేశానికి పాకిస్థాన్, చైనా ఎస్‌సీఓ - ఎన్ఎస్ఏ ప్రతినిధులు హాజరయ్యారు.
షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్:
ఇది 2001లో ప్రారంభించబడిన అంతర ప్రభుత్వ సంస్థ.
ఎస్‌సీఓ సభ్యదేశాలు:
ఇండియా, చైనా, ఖజకిస్తాన్, కిర్గిస్థాన్, పాకిస్థాన్, రష్యా, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్.
పాక్ ప్రధాన న్యాయమూర్తి అధికారాల తగ్గింపుకు బిల్లు:
పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) అధికారాలను తగ్గించేందుకు ఆ దేశ పార్లమెంటు కీలక బిల్లును ఆమోదించింది. సుమోటో కేసులు, రాజ్యాంగ సంబంధ ధర్మాసనాలపై నిర్ణయాలపై సీజేకు ఉన్న సంపూర్ణ అధికారాలను తగ్గించేందుకు ఉద్దేశించిన ‘ది సుప్రీంకోర్టు (ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్) బిల్లు - 2023’ పార్లమెంట్ ఆమోదం పొందింది. దీని ప్రకారం ఇటువంటి నిర్ణయాలకు ఇకపై ముగ్గురు సీనియర్ న్యాయమూర్తుల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో సీజే కూడా ఒక సబ్యుడిగా ఉంటారు.
సూకీ పార్టీని రద్దు చేసిన మయన్మార్ సైనిక ప్రభుత్వం:
రాజకీయ ప్రత్యర్థులను నిర్వీర్యం చేసే దిశగా మయన్మార్ సైనిక ప్రభుత్వం 40 ప్రతిపక్ష పార్టీలను రద్దు చేసింది. ఇందులో అంగ్ సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ కూడా ఉంది. ఇచ్చిన గడువు లోపు నమోదు చేసుకోని పార్టీలను రద్దు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
యాదాద్రి, వర్గల్ దేవాలయాలకు జాతీయ ఫుడ్ సేఫ్టీ గుర్తింపు:
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, వర్గల్ శ్రీ విద్యా సరస్వతి దేవస్థానాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, కుటుంబ ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) జాతీయ సర్టిఫికెట్ బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్ (భోగ్) గుర్తింపు లభించింది. దేశంలోని 70 దేవాలయాలకు పైగా ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో యాదాద్రి, వర్గల్ దేవాలయాలను సందర్శించి నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత, వంటగది నిర్వహణ, ఆహారం తయారీ విధానం, పాటించే శుభ్రత అంశాలపై పరిశీలించి ఎంపిక చేశారు.
అసోచామ్ అధ్యక్షుడిగా అజయ్ సింగ్:
భారత్‌లోని పరిశ్రమ సంఘాల్లో ఒకటైన అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) అధ్యక్షుడిగా స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అసోఛామ్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా సోరిన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ చైర్మన్ సంజయ్ నాయర్ వ్యవహరించనున్నారు.