లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 9-2-2023
యూఏఈ, ఫ్రాన్స్‌లతో భారత్ త్రైపాక్షిక సహకారం
యూఏఈ, ఫ్రాన్స్‌లతో భారత్ త్రైపాక్షిక సహకారం:
ఉక్రెయిన్ యుద్ధం అనిశ్చితిలో అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఉన్న నేపథ్యంలో భారత్ మరో కీలక కూటమి దిశగా ఫ్రాన్స్, యూఏఈలతో వివిధ రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించుకుంది.
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్, ఫ్రెంచ్ మంత్రి కేథరిన్ కలోనా, యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ సహ్యాన్ లు ఒక ప్రకటన విడుదల చేశారు.
సైబర్ సెక్యూరిటీ బలోపేతానికి క్వాడ్ నిర్ణయం:
సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసేందుకు మెషిన్ లెర్నింగ్‌తోపాటు ఇతర అత్యాధునిక సాంకేతికతలను కలిసికట్టుగా ఉపయోగించుకోవాలని ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలతో కూడిన క్వాడ్ కూటమి నిర్ణయించింది.
శ్వేతసౌధం వెలువరించిన ఓ ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది.
సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి సభ్య దేశాలకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని తెలిపింది.
తమ తమ దేశాల్లోని ప్రజలకు, ప్రభుత్వాలకు, వ్యాపార సంస్థలకు వివిధ కార్యక్రమాల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి క్వాడ్ కృషి చేస్తుందని వివరించింది.
మయన్మార్‌లో సైనిక పాలన:
ప్రస్తుతం అమలులో ఉన్న అత్యయిక స్థితిని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మయన్మార్ లో అధికారంలో ఉన్న సైనిక ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టులో జరగాల్సిన ఎన్నికలను జాప్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది.
ఈ మేరకు సమావేశమైన జాతీయ రక్షణ, భద్రతా మండలి నిర్ణయం తీసుకుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మరికాస్త సమయం పడుతుందని ఎన్ఎస్‌డీపీ తన ప్రకటనలో వెల్లడించడం గమనార్హం.
స్టార్టప్స్ లో 8వ స్థానంలో తెలంగాణ:
అంకుర సంస్థల (స్టార్టప్) ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్, బీహార్ కంటే దిగువ స్థాయిలో నిలిచింది.
2022 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా 86,713 స్టార్టప్ లు ఏర్పాటవగా వాటిలో 1,342 అంకురాలతో ఏపీ 15వ స్థానానికి పరిమితమైంది. 4,566 స్టార్టప్‌లతో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది.
తొలి 5 స్థానాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఆక్రమించాయి. దక్షణాదిలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ తర్వాతి స్థానంలో ఏపీ నిలిచింది. కేంద్రం ప్రకటించిన స్టేట్స్ స్టార్టప్స్ ర్యాంకింగ్ ఎక్సైజ్ - 2022లో తెలంగాణ టాప్ పెర్ఫార్మర్ గా 7వ స్థానంలో నిలవగా, ఏపీ 29వ స్థానానికి పరిమితమైంది.