దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు - 2023
మన దేశ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'. 1969 నుంచి సినీ రంగంలో ఈ అవార్డు ఇవ్వడం ప్రారంభమైంది. ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి ప్రెస్టీజియస్ అవార్డులలో దాదా సాహెబ్ పాల్కే అవార్డు కూడా ఒకటి. కాగా ఇప్పటివరకు 50 మంది దీన్ని అందుకున్నారు. అయితే తాజాగా ముంబై తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో జరిగిన 2023 వేడుకల్లో హిందీ చిత్ర సీమ నుంచి 32 మంది, మిగతా 18 మంది ఇతర భారతీయ భాషల రంగం నుంచి ఎంపికయ్యారు.
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ – 'రౌద్రం రణం రుధిరం'
ఉత్తమ నటుడు – రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర పార్ట్ 1 : శివ)
ఉత్తమ నటి – అలియా భట్ (గంగూబాయి కతియావాడి)
విమర్శకుల ఉత్తమ నటుడు – వరుణ్ ధావన్ (భేడియా)
విమర్శకులు ఉత్తమ నటి – విద్యాబాలన్ (జల్సా)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – పి ఎస్ వినోద్ (విక్రమ్ వేద) – హిందీ
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ – రిషబ్ శెట్టి (కాంతారా)
లివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటి – తేజస్వి ప్రకాష్ (నాగిన్)
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ – అనుపమ
ఉత్తమ నేపథ్య గాయకుడు – విశాల్ మిశ్రా
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ – కనికా కపూర్
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – జయకృష్ణ గుమ్మడి
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రామస్వామి
భారత సంతతికి చెందిన మరో రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నట్టు తెలిపారు. వివేక్ రామస్వామి ప్రముఖ వ్యాపారవేత్త. నిక్కీ హేలీ తర్వాత ఇటువంటి ప్రకటన చేసిన భారత సంతతికి చెందిన రెండో నేత ఈయనే. హేలీ కూడా రిపబ్లికన్ పార్టీకి చెందినవారే. 'అమెరికా ఆదర్శాలను పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాను' అని రామస్వామి అన్నారు.
ఐఎస్‌ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో ప్రతాప్‌కు పసిడి:
ఈజిఫ్ట్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ గోల్డ్ మెడల్ సాధించాడు. ముందుగా క్వాలిఫికేషన్ రౌండ్‌లో 588 పాయింట్స్‌తో అగ్రస్థానంలో నిలిచిన ప్రతాప్.. ర్యాంకింగ్ మ్యాచ్‌లో 406.4 పాయింట్స్‌తో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లోనూ ప్రతాప్ అదే జోరు ప్రదర్శించాడు. ఆస్ట్రియాకు చెందిన అలెగ్జాండర్ ష్మిర్ల్‌పై 6-16 తేడాతో విజయం సాధించాడు. 11 సిరీస్‌ల్లో ఎనిమిదింటిని కైవసం చేసుకున్న ప్రతాప్ ఫైనల్‌ను ఏకపక్షంగా గెలుచుకుని విజేతగా నిలిచాడు. దాంతో భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణం చేరింది.
షూటింగ్ ప్రపంచకప్‌లో రుద్రాంక్ష్‌కు స్వర్ణం:
షూటింగ్ ప్రపంచకప్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో ప్రపంచ ఛాంపియన్ రుద్రాంక్ష్ పాటిల్ పసిడితో మెరిశాడు. ఫైనల్లో మ్యాక్స్ మిలన్ (జర్మనీ) పై నెగ్గాడు. ర్యాంకింగ్ రౌండులోనూ పాటిల్ (262) అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో అతడికిది రెండో స్వర్ణం.
అత్యుత్తమ పోలీస్ స్టేషన్‌గా దుండిగల్ ఠాణా:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ ఠాణాగా ఎంపికైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏటా దేశవ్యాప్తంగా అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తుంది. 2022కు గాను దుండిగల్ ఠాణా తెలంగాణలో తొలి ర్యాంకు సాధించింది. కేంద్ర హోం శాఖ ఇచ్చిన ప్రశంసాపత్రాన్ని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, మేడ్చల్ డీసీపీ సందీప్, దుండిగల్ ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డిలకు హైదరాబాద్ లో అందించారు.
టెన్నిస్ కు సానియా వీడ్కోలు:
తన చివరి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్ లో టైటిల్‌కు చేరువగా వెళ్లి, ఫైనల్లో ఓడిన సానియా మీర్జా కెరీర్ చివరి టోర్నీలో మాత్రం నిరాశపరిచింది. దుబాయ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీలో మాడిసన్ కీస్ (అమెరికా)తో కలిసి బరిలోకి దిగిన ఆమె తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. తన కెరీర్లో ఇదే చివరి టోర్నీ అని, దీని తర్వాత రిటైరవబోతున్నానని సానియా ముందే ప్రకటించింది.
మహిళల డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ లో కలిపి ఆరు గ్రాండ్ స్లామ్ విజయాలు సాధించింది.
ఆసియా క్రీడల్లో ఆమె అద్భుతంగా రికార్డులు సృష్టించింది.
2002లో కాంస్యంతో మొదలెట్టిన ఆమె మొత్తం ఈ క్రీడల్లో ఎనిమిది పతకాలు సాధించింది.
అందులో రెండు స్వర్ణాలు, మూడు రజతాలున్నాయి.
పాల్గొన్న ప్రతి ఆసియా గేమ్స్ లో కనీసం ఒక్క పతకమైనా నెగ్గింది.
2010 కామన్వెల్త్ క్రీడల్లో సింగిల్స్ రజతం, డబుల్స్ కాంస్యం సాధించింది.
ఫెడరేషన్ కప్ (ఇప్పుడు బిల్లీ జీన్ కింగ్ కప్) లోనూ సానియా గొప్పగా రాణించింది. 27 మ్యాచ్‌ల్లో గెలిచి 10 ఓడింది.
2020లో ఆమె ప్రదర్శన వల్లే ఆ టోర్నీ చరిత్రలో భారత్ తొలిసారి ప్లే ఆఫ్ దశకు చేరుకుంది.
2006లో ఖేల్ రత్న, 2016లో పద్మభూషణ్ అవార్డులను అందుకుంది.
ఇవి కూడా చదవండి: