అధికారుల ఓవరాక్షన్.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు పవర్ కట్

దిశ, ఆంధోల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అధికారులు కరెంట్ కట్ చేశారు. దీంతో లబ్ధిదారులు కదలకుండా ఇండ్లలోనే ఉండిపోయారు. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం డాకుర్‌లో నిర్మించిన 104 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లాటరీ పద్దతిలో ఈ నెల 6న లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇండ్లను కేటాయించారు. అయితే ఈ ఇండ్లను మంత్రి హరీష్ రావు చేత ప్రారంభించాలని ఈ నెల 10న నిర్ణయించగా, అనివార్య […]

Update: 2021-11-15 10:33 GMT

దిశ, ఆంధోల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అధికారులు కరెంట్ కట్ చేశారు. దీంతో లబ్ధిదారులు కదలకుండా ఇండ్లలోనే ఉండిపోయారు. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం డాకుర్‌లో నిర్మించిన 104 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లాటరీ పద్దతిలో ఈ నెల 6న లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇండ్లను కేటాయించారు. అయితే ఈ ఇండ్లను మంత్రి హరీష్ రావు చేత ప్రారంభించాలని ఈ నెల 10న నిర్ణయించగా, అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇండ్ల పంపిణీలో అన్యాయం జరిగిందని, అనర్హులను ఎంపిక చేశారంటూ మీడియాలో రావడంతో అధికారులు మరోసారి సమగ్ర విచారణను చేపట్టారు.

దీంతో ఎక్కడ తమకు కేటాయించిన ఇండ్లను క్యాన్సిల్ చేస్తారోనన్న ఆందోళనతో లబ్ధిదారులు అనాధికారికంగా గృహ ప్రవేశాలు చేసి ఇండ్లలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో వారికి కేటాయించిన ఇండ్లు లబ్ధిదారులకే ఉంటాయని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఖాళీ చేయాలని ఆంధోల్ తహసీల్దార్ అశోక్ సోమవారం మధ్యాహ్నం లబ్ధిదారులను కలిసి నచ్చజెప్పడంతో వారు ఒప్పుకున్నారు. అయితే సాయంత్రం వరకు ఇండ్లను ఖాళీ చేయలేదన్న సమాచారంతో అధికారులు సోమవారం రాత్రి కరెంట్‌ను కట్ చేశారు. లబ్ధిదారులు మాత్రం అంధకారంలోనే ఉండిపోయారు. దీంతో లబ్ధిదారులు మంగళవారమైనా ఖాళీ చేస్తారా లేదా అన్న టెన్షన్ అధికారుల్లో నెలకొంది.

 

Tags:    

Similar News