ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలి
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వ సూచనల ప్రకారమే పంటలు వేసే దిశగా తెలంగాణ రైతులను సన్నద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సాంప్రదాయ సాగు నుంచి రైతులను బయటికి తీసురావాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సమీక్ష జరిపారు. రైతు తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే స్థితికి రావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహం దేశంలోని ఏ రాష్ట్రంలో రైతులకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ […]
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వ సూచనల ప్రకారమే పంటలు వేసే దిశగా తెలంగాణ రైతులను సన్నద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సాంప్రదాయ సాగు నుంచి రైతులను బయటికి తీసురావాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సమీక్ష జరిపారు. రైతు తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే స్థితికి రావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహం దేశంలోని ఏ రాష్ట్రంలో రైతులకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనర్ధన్ రెడ్డి, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.