IPL ఫ్యాన్స్‌కు పండగే.. ధోని Vs రోహిత్.. గెలుపు ఎవరిది.?

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) మళ్లీ వచ్చేసింది. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. యూఏఈ వేదికగా ఐపీఎల్-2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొవిడ్​వ్యాప్తి కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మొదటి దశలో 29 మ్యాచ్‌లే జరిగాయి. రెండో దశలో మిగిలిన 31 మ్యాచ్‌లను అక్టోబరు 15 వరకు బీసీసీఐ నిర్వహించనుంది. దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 7.30 […]

Update: 2021-09-19 04:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) మళ్లీ వచ్చేసింది. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. యూఏఈ వేదికగా ఐపీఎల్-2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొవిడ్​వ్యాప్తి కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మొదటి దశలో 29 మ్యాచ్‌లే జరిగాయి. రెండో దశలో మిగిలిన 31 మ్యాచ్‌లను అక్టోబరు 15 వరకు బీసీసీఐ నిర్వహించనుంది. దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టబోతోంది.

ముంబై- చెన్నై మ్యాచ్ ఎప్పడు ఆసక్తికరమే..

ఐపీఎల్‌లో ముంబై, చెన్నై జట్ల మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. చిరకాల ప్రత్యర్థులుగా పేరొందిన ఈ రెండు జట్లు తలపడితే భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. రెండు జట్లు తలపడిన రికార్డులు పరిశీలిస్తే ముంబైదే పై చేయిగా ఉంది. ఓవరాల్‌గా ముంబై టీమ్ ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలవగా.. చెన్నై జట్టు మూడు సార్లు టైటిల్ గెలిచింది. దుబాయ్ గ్రౌండ్‌లు తొలుత పేసర్లకి అనుకూలించి, ఆ తర్వాత స్పిన్నర్లకు అవకాశమిస్తాయి.

Tags:    

Similar News