మిడతలదండుతో జర భద్రం

దిశ, న్యూస్‌బ్యూరో: ఎటువంటి పరిస్ధితులు ఎదురైనా మిడతల దండును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పలు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. సరిహద్దు జిల్లాలలో మిడతలు దాడి చేసే అవకాశం ఉన్న ప్రభావిత గ్రామాల కోసం వెంటనే సూక్ష్మ స్ధాయి (మైక్రో లెవల్) ప్రణాళికను తయారుచేయాలన్నారు. గ్రామాలలో అందుబాటులో ఉన్న మానవ వనరులు, పరికరాలు, మెటీరియల్‌కు సంబంధించి తక్షణం ఇన్వెంటరీను తయారు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మిడతలు దాడి చేసే […]

Update: 2020-06-17 08:27 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ఎటువంటి పరిస్ధితులు ఎదురైనా మిడతల దండును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పలు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. సరిహద్దు జిల్లాలలో మిడతలు దాడి చేసే అవకాశం ఉన్న ప్రభావిత గ్రామాల కోసం వెంటనే సూక్ష్మ స్ధాయి (మైక్రో లెవల్) ప్రణాళికను తయారుచేయాలన్నారు. గ్రామాలలో అందుబాటులో ఉన్న మానవ వనరులు, పరికరాలు, మెటీరియల్‌కు సంబంధించి తక్షణం ఇన్వెంటరీను తయారు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మిడతలు దాడి చేసే ప్రభావం ఉన్న తొమ్మిది జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు, ఫైర్, వ్యవసాయ, అటవీ శాఖ అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా పై విధంగా ఆదేశించారు. ఈ సమావేశానికి నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులు హాజరయ్యారు.

గ్రామ స్ధాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వీలైనంత ఎక్కువ సంఖ్యలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రతీ మండలానికి ఒక స్పెషల్ ఆఫసర్‌ను నియమించాలని సూచించారు. జిల్లా స్ధాయిలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లు సరిహద్దు జిల్లాలతో సమన్వయంతో పనిచేస్తూ మిడతల దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇందుకు అవసరమైన స్ప్రేయర్లు, సేఫ్టీ కిట్లు, మెటీరియల్, నీటి వసతి, లైటింగ్ తదితర వసతులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇందుకోసం స్టాండింగ్ ఆపరేటరీ ప్రొసీజర్స్‌తో అడ్వైజరీని తయారు చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, పీసీసీఏఫ్ శోభ, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, అగ్నిమాపక శాఖ డిజి సంజయ్ జైన్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సెలర్ డాక్టర్ ప్రవీణ్ రావు, ముఖ్య ఎంటమాలజిస్ట్ రెహమాన్, సశ్య సంరక్షణ అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News