ప్రాణాలకంటే రిజిస్ట్రేషన్లే ముఖ్యమా?
దిశ, మహబూబ్‌నగర్: ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. అలాగే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు కూడా అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సామాజిక దూరం పాటించడం అటు అధికారులు ఇటు ప్రజలు కూడా మరిచిపోయారు. సాయంత్రం 7 అవుతున్నా శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అటు ప్రజలు, ఏజెంట్లు ఒక్కసారిగా లోపలికి రావడంతో కార్యాలయం కిక్కిరిసిపోయాయింది. అక్కడ ఉన్న వారు ఎవరూ కూడా కనీసం సామాజిక […]
దిశ, మహబూబ్‌నగర్: ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. అలాగే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు కూడా అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సామాజిక దూరం పాటించడం అటు అధికారులు ఇటు ప్రజలు కూడా మరిచిపోయారు. సాయంత్రం 7 అవుతున్నా శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అటు ప్రజలు, ఏజెంట్లు ఒక్కసారిగా లోపలికి రావడంతో కార్యాలయం కిక్కిరిసిపోయాయింది. అక్కడ ఉన్న వారు ఎవరూ కూడా కనీసం సామాజిక దూరం పాటించకుండా, గుంపులు గుంపులుగా ఉండడం కనిపించింది. ప్రాణాలకంటే భూములే ముఖ్యం అనే రీతిలో ప్రజలు వ్యవహరించారు.