మైలారం చెరువులో మొసలి.. భయంతో వణికిపోతున్న జనాలు
దిశ, కొత్తగూడ : సాధారణంగా మొసలిని జూ పార్క్లో చూస్తాం. అలాంటిది కండ్ల ముందు కనపడితే ఆ అనుభవం ఎంత భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… కొత్తగూడ మండలంలోని మైలారం చెరువులో మొసలి కదలికలు పరిసర రైతులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లిన రైతులకు మొసలి తారసపడింది. ఈ ఘటనతో పరిసర ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చెరువు చుట్టూ పొలాలు ఉండటంతో సాధారణంగా రైతులు రాత్రనకా, పగలనకా వెళ్తుంటారు. […]
దిశ, కొత్తగూడ : సాధారణంగా మొసలిని జూ పార్క్లో చూస్తాం. అలాంటిది కండ్ల ముందు కనపడితే ఆ అనుభవం ఎంత భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… కొత్తగూడ మండలంలోని మైలారం చెరువులో మొసలి కదలికలు పరిసర రైతులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లిన రైతులకు మొసలి తారసపడింది. ఈ ఘటనతో పరిసర ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చెరువు చుట్టూ పొలాలు ఉండటంతో సాధారణంగా రైతులు రాత్రనకా, పగలనకా వెళ్తుంటారు. మొసలి కదలికలు గుర్తించిన నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. మైలారం చెరువు పాకాల చెరువును ఆనుకొని ఉండటంతో మొసలి ఈ చెరువులోకి వచ్చినట్లు రైతులు అనుమానిస్తున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి మొసలిని చెరువులో నుంచి తరలించాలని కోరుతున్నారు.