రేవ్ పార్టీ కేసులో చర్యలు ప్రారంభం.. ఒకేసారి ముగ్గురిపై వేటు
బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. తెలుగు, కన్నడ వంటి రెండు బడా సినీ పరిశ్రమలను ఉలిక్కిపడేలా చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. తెలుగు, కన్నడ వంటి రెండు బడా సినీ పరిశ్రమలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ పార్టీకి రెండు పరిశ్రమలకు చెందిన నటీనటులు, పలు రంగాల ప్రముఖులు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు, డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో అధికారులు, పోలీసులు సైతం సీరియస్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో చర్యలు ప్రారంభించారు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్‌హౌజ్ ఏరియాలోని హెబ్బగోడి పోలీస్ స్టేషన్‌కు ముగ్గురు పోలీసులపై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏఎస్‌ఐ నారాయణ స్వామి, కానిస్టేబుళ్లు గిరీష్, దేవరాజును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరోవైపు రేవ్ పార్టీ జరిగిన జీఆర్ ఫాంహౌస్ హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డిదిగా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ దాడిలో ఇంకా సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు లభ్యమవ్వగా.. పార్టీకి తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా హాజరైనట్లుగా తేల్చారు. అది కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారే వీరిలో అత్యధికంగా ఉన్నారట.
Read More..
బైక్ పై యువ జంట రొమాన్స్.. అదే జంటతో మరో వీడియో చేయించిన పోలీసులు!