ఒడిశా టూ హైదరాబాద్ గంజాయి సరఫరా ముఠా అరెస్ట్

ఒడిషా నుంచి హైదరాబాద్ కు గంజాయి సరఫరా చేస్తున్న ముఠా నుంచి

Update: 2024-07-30 13:05 GMT

దిశ,మహేశ్వరం: ఒడిషా నుంచి హైదరాబాద్ కు గంజాయి సరఫరా చేస్తున్న ముఠా నుంచి మహేశ్వరం పోలీసులు 50.42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులను మంగళవారం రిమాండ్ కు తరలించారు. మహేశ్వరం జోన్ డీసీపీ సునీత రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు మండలానికి చెందిన లారీ డ్రైవర్ చదలవాడ అనిల్ (39), ఏపీ అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జానకిరామ్ పురం గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి వెంకటలక్ష్మి (37) మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర మండలం బండ్లగూడలోని ఎస్ ఆర్ ప్రైమరీ స్కూల్లో అటెండర్ గా పని చేస్తుంది.వీరుద్ధరు ఒడిషా రాష్ట్రానికి చెందిన పట్నా నాయక్ వద్ద నుంచి ఈనెల 27 తేదీన 24 గంజాయి ప్యాకెట్లు (ఒకొక్క ప్యాకెట్ రెండు కిలోలు సుమారు) మూడు వేల రూపాయలు చొప్పున కోనుగోలు చేశారు.ఈ నెల 28 తేదీన ఏపీ తుని నుంచి గంజాయినీ మూడు లాగేజీ బ్యాగ్ లలో ఆర్టీసీ బస్సులో చదలవాడ అనిల్, అమ్మిరెడ్డి వెంకటలక్ష్మి ఈ నెల 29 తేదీన ఉదయం పూట హైదారాబాద్ ఎల్బీ నగర్ కు చేరుకున్నారు.

ఎల్బీ నగర్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితులు వేరే ఆర్టీసీ బస్సు ఎక్కి చాంద్రాయణ గుట్ట కు వచ్చారు.హైదారాబాద్ కు చెందిన సురిబాబు, నాగ్ లకు మేము హైదారాబాద్ చేరుకున్నమాన్ని చదాలవాడ అనిల్, అమ్మిరెడ్డి వెంకటలక్ష్మి సమాచారం అందించారు.దీంతో హైదారాబాద్ కు చెందిన సూరిబాబు, నాగ్ లు చదాలవాడ అనిల్,అమ్మిరెడ్డి వెంకటలక్ష్మి నీ శ్రీశైలం జాతీయ రహదారి లేమూర్ గేట్ వద్ద కలుస్తామాన్ని చెప్పారు.ఈ విషయం ఈ నెల 29 తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మహేశ్వరం పోలీసులకు లేమూర్ గేట్ వద్ద గంజాయి ముఠా సమాచారం అందడంతో చదాలవాడ అనిల్, అమ్మిరెడ్డి వెంకటలక్ష్మి నుంచి 50.42 కిలోల గంజాయిని,నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.చదాలవాడ అనిల్, అమ్మిరెడ్డి వెంకటలక్ష్మి నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.13 లక్షలు  ఉంటుందన్నారు.

మంగళ వారం చదాలవాడ అనిల్, అమ్మిరెడ్డి వెంకటలక్ష్మి నీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.గతంలో వీరిపై ఏపీ,తెలంగాణ లోని పలు పోలీస్ స్టేషన్ లల్లో పలు కేసులు నమోదు అయ్యాయి. హైదారాబాద్ కు చెందిన సూరిబాబు,నాగ్ లు పరారీలో ఉన్నారు.డ్రగ్స్ అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందాన్ని డీసీపీ సునీత రెడ్డి తెలిపారు.మహేశ్వరం పోలీస్ సిబ్బందికి డీసీపీ సునీత రెడ్డి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత రెడ్డి,మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు రవీందర్, వెంకట్ రెడ్డి, మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News