జనపద్ పంచాయితీ చీఫ్ పూజా దాదు ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో జనపద్ పంచాయతీ ప్రెసిడెంట్ పూజా దాదు (30) ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో జనపద్ పంచాయతీ ప్రెసిడెంట్ పూజా దాదు (30) ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. బుర్హాన్‌పూర్‌లోని తన నివాసంలో ఉరేసుకుని కనిపించిన ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఖక్నార్ జనపద్ పంచాయతీ ప్రెసిడెంట్ మాజీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, దివంగత రాజేంద్ర దాదు కుమార్తెనే పూజా దాదు. ఆమె బీజేపీ మద్దతుతో జనపద్ పంచాయతీ అధ్యక్షురాలిగా ఎంపికైంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, ప్రాథమిక దర్యాప్తులో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీనియర్ అధికారి దేవేంద్ర పాటిదార్ తెలిపారు. కానీ, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మనోజ్ లాధ్వే తెలిపారు. పూజా దాదు అక్క మంజు దాదు ప్రస్తుతం మధ్యప్రదేశ్ మండి బోర్డు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.